అక్రమ సరోగసే ప్రాణం తీసిందా ? మై హోం భుజాలో ఏం జరిగిందంటే!
మొత్తం హైదరాబాద్‌లోనే అత్యంత లగ్జరీ అపార్ట్‌మెంట్ మై హోం భుజ. 24/7 కెమెరాలతో సెక్యూరిటీ. అనుమతి లేనిదే వీఐపీలకు కూడా నో ఎంట్రీ. అలాంటి సెక్యూర్డ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టుండి నైన్త్ ఫ్లోర్ నుంచి ఓ అమ్మాయి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏం జరిగిందో అంతా అర్థం చేసుకునేలోపే అమ్మాయి ప్రాణాలు గాళ్లో కలిసిపోయాయి.
మొత్తం హైదరాబాద్‌లోనే అత్యంత లగ్జరీ అపార్ట్‌మెంట్ మై హోం భుజ. 24/7 కెమెరాలతో సెక్యూరిటీ. అనుమతి లేనిదే వీఐపీలకు కూడా నో ఎంట్రీ. అలాంటి సెక్యూర్డ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టుండి నైన్త్ ఫ్లోర్ నుంచి ఓ అమ్మాయి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏం జరిగిందో అంతా అర్థం చేసుకునేలోపే అమ్మాయి ప్రాణాలు గాళ్లో కలిసిపోయాయి. కట్ చేస్తే ఈ మరణం వెనక పెద్ద క్రైం స్టోరీ బయటపడింది. సెక్యూరిటీ స్టాండర్డ్స్ హై లెవెల్‌లో ఉండే ఆ అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ జరగడం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి పేరు అశ్విత సింగ్. ఆమెది ఒరిస్సా. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబం వాళ్లది. మై హోం భుజాలో ఉండే రాజేష్ బాబు ఆమెను పనిలో పెట్టుకున్నాడు. రాజేష్‌కు ఆమె చెయ్యాల్సిన పని సరోగసి ద్వారా పిల్లల్ని కనడం. ఇందుకోసం అశ్వితకు పది లక్షలు ఇచ్చాడు రాజేష్ బాబు. అందరికీ తన కుటుంబంలోని వ్యక్తి అని చెప్పి మేనేజ్ చేశాడు.
కానీ కొన్ని రోజులకు రాజేష్ పద్ధతిలో తేడా వచ్చింది. అశ్వితను నిజంగా తన భార్యగా ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడు రాజేష్ బాబు. ఈ వ్యవహారం అశ్వితకు నచ్చలేదు. వద్దని చెప్పేందుకు చాలా సార్లు ప్రయత్నించింది. కానీ రాజేష్ వినలేదు. వేధించడం ఇంకా ఎక్కువ చేశాడు. దీంతో అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంది అశ్విత. కానీ ఆమె పారీపోయే సమయంలో రాజేష్ చూశాడు. దీంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో 9వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది అశ్విత. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇండియాలో సరోగసి లీగలే కావొచ్చు. కానీ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. IVF ద్వారా పిల్లల్ని కనడం ఇండియాలో చాలా కాలం నుంచి జరుగుతోంది. కానీ డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే అది జరిగుంది. లీగల్‌గా కూడా ఎలిజబుల్ కపుల్స్‌కు మాత్రమే సరోగసి చేయించుకునేందుకు అనుమతి ఇస్తారు. కానీ రాజేష్ మాత్రం అవేమీ పాటించకుండా నేరుగా అశ్విత అనే అమ్మాయితో డీల్ పెట్టుకున్నాడు అనే వాదనలు వినిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతుంది అనే విషయం పక్కన పెడితే.. తన స్వార్థానికి తీసుకొచ్చిన అమ్మాయిని ఈ లోకంలో లేకుడా చేశాడు రాజేష్. ఆమె ద్వారా తండ్రి కావాలి అనుకుని ఆమె బిడ్డకే తల్లి లేకుండా చేశాడు.