Skanda: రామ్ ఎనర్జీ ఏమైపోయింది ? శ్రీలీలతో పోటీ పడలేకపోయాడా ?
రామ్ స్కంద సినిమాలో డ్యాన్స్ పై పెద్దగా ఆసక్తి చూపలేదా..

Did Ram Pothineni not dance as much as expected in the Skanda movie
రామ్‌కు ఏమైంది? ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా వుండే ఈకుర్ర హీరో ఎందుకు డల్ అయిపోయాడు. స్కంద సాంగ్స్ బైటకొచ్చిన తర్వాత ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలవుతున్నారు. ఉన్నట్టుండి రామ్‌లో ఇంత ఛేంజ్ ఎందుకొచ్చింది అని అనుకుంటున్నారు. తెలుగులో ఎనర్జిట్ డ్యాన్స్ అంటే.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ గురించి చెబుతారు. అయితే.. రామ్ డ్యాన్స్‌పెర్‌ఫార్మెన్స్‌ను కూడా మెచ్చుకునేవాళ్లూ ఎక్కువ మందే వున్నారు. యంగ్ స్టార్స్ కొందరు రామ్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు పెద్ద ఫ్యాన్. డ్యాన్స్ మూమెంట్ స్లో అయినా.. స్పీడ్ అయినా.. ఓ రిథమ్ ప్రకారం చేస్తూ.. ఇంప్రెస్ చేసేస్తాడు.
రామ్ సినిమా ఎలా వున్నా.. డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకులున్నారు. రామ్‌కు ఏది బలమో..అదే మైనస్ అవుతుందా? అనిపిస్తోంది. స్కంద పాటల్లో రామ్‌ను చూసిన తర్వాత అందరిదీ ఒకే మాట. రామ్‌కు ఏమైంది? అందమైన డ్యాన్స్ మ్యూమెంట్స్ ఏవంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్కంద నుంచి నాలుగు పాటలు వస్తే.. మూడు పాటల్లో ముద్దుగుమ్మల డామినేషనే కనిపించింది. శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ ఆకట్టుకుంటే.. రామ్ హీరోయిన్‌తో పోటీపడలేకపోయాడు. రీసెంట్‌గా రిలీజైన ఐటంసాంగ్‌లో రామ్ డ్యాన్స్ నార్మల్‌గానే కనిపించింది. స్టెప్పులేస్తున్నా? అందంగా వుండడం లేదని.. ఫ్యాన్స్ ఫీలయ్యారు. క్లైమాక్స్‌లో కనిపించే ఒక గెటప్ కోసం వెయిట్ పెరిగాడని.. ఆ కారణంగానే.. డ్యాన్స్‌లో ఈజ్ కనిపించలేదా? అన్న డౌట్ కూడా వుంది.