BIRYANI ORDERS : ఏంటీ ! బిర్యానీలే తింటున్నారా..?
హైదరాబాద్ (Hyderabad) జనం ఇళ్ళల్లో అన్నం వండుకోవడం మానేశారా ? ఏంటి కిచన్లు కూడా ఎత్తేశారా ? పోయిలో పిల్లిని కూడా లేపడం లేదా ?... స్విగ్గీలో హైదరాబాదీలు ఆర్డర్ ఇచ్చిన బిర్యానీల సంఖ్య చూస్తే ఇలాగే అనిపిస్తుంది.
హైదరాబాద్ (Hyderabad) జనం ఇళ్ళల్లో అన్నం వండుకోవడం మానేశారా ? ఏంటి కిచన్లు కూడా ఎత్తేశారా ? పోయిలో పిల్లిని కూడా లేపడం లేదా ?… స్విగ్గీలో హైదరాబాదీలు ఆర్డర్ ఇచ్చిన బిర్యానీల సంఖ్య చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఇక్కడ జనం ఎంత బిర్యానీ ప్రియులో. ఒకటా రెండా… సెకన్ కు 2.3 బిర్యానీలు లాగించేస్తున్నారు. ఏడాదికి కోటి 30 లక్షల ఆర్డర్స్ ఒక్క స్విగ్గీలోనే బుక్ అయ్యాయి. ఇక మిగతా ఫుడ్ డెలివరీస్ యాప్స్ (Food Deliveries Apps) కూడా కలుపుకుంటే దీనికి రెట్టింపు అవుతుందేమో.
నో డౌట్… హైదరాబాద్ ను ఇక ఎట్టి పరిస్థితుల్లో బిర్యానీ (Biryani) కేపిటల్ గా ప్రకటించాల్సిందే. ఎందుకంటే హైదరాబాదీలతో బిర్యానీకి ఉన్న బంధం అలాంటిది మరి. దేశంలో హైదరాబాద్ బిర్యానీకి ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక్కడి నుంచి విదేశాల నుంచి కూడా టన్నుల కొద్దీ ఎగుమతి అవుతోంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలు… ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తింటారు. ప్రపంచంలో ఎన్ని వెరైటీలు ఉన్నా… ఇక్కడి బిర్యానీకి ఉన్నంత టేస్ట్ మరెక్కడా రాదని అంటుంటారు. భారతీయులే కాదు… విదేశీయులు కూడా ఇదే మాట ఒప్పుకుంటారు. ఒకప్పుడు భాగ్యనగరాన్ని పాలించిన కుతుబ్ షాహీల ద్వారా పర్షియా నుంచి వచ్చిన బిర్యానీ ఇక్కడి సంస్కృతిలో భాగంగా మారింది. ఇందులో ఉపయోగించే స్పైసిస్ వల్లే టేస్ట్ మరింత పెరుగుతుంది. సిటీలో 15 వేలకు పైగా రెస్టారెంట్లు బిర్యానీ రుచులను అందిస్తున్నాయి. వీటిల్లో నుంచి స్విగ్గీ, జొమటా లాంటి అనేక ఫుడ్ డెలివరీ సంస్థలు జనానికి వేడి వేడి టేస్టీ.. టేస్టీ బిర్యానీలను అందిస్తున్నాయి.
దేశంలో ప్రతి ఐదు బిర్యానీల్లో ఒక్కటి హైదరాబాద్ నుంచి అమ్ముడు పోయినట్టు స్వీగ్గీ చెబుతోంది. సిటీలో ఏడాదిలో 13 మిలియన్ల బిర్యానీలు ఆర్డర్ తీసుకున్నట్టు తెలిపింది. అంటే సెకన్ కు దాదాపు 2 బిర్యానీలను ఆర్డర్ ఇస్తున్నారు హైదరాబాదీలు. వెజిటబుల్ బిర్యానీ అసలు బిర్యానీయే కాదని అంటుంటారు నాన్ వెజ్ ప్రియులు. అందుకేనేమో… ఈ కోటీ 30 లక్షల ఆర్డర్స్ లో ఎక్కువగా చికెన్ బిర్యానీయే అమ్ముడు పోయింది. ఆ తర్వాత వెజ్ బిర్యానీ సెకండ్ ప్లేస్ లో, చికెన్ దమ్, మటన్ బిర్యానీలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా పగలూ… రాత్రిళ్ళు కూడా బిర్యానీ ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయని స్విగ్గీ చెబుతోంది.