CM Revanth Reddy, Mallareddy : ఆ విషయం ఎప్పుడో చెప్పా.. ఏంది మల్లన్న.. ఇలా ప్లేట్ తిప్పేశావ్…
మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం.. తెలంగాణ రాజకీయాల్లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ కాలేజీలో కూల్చివేతలు జరగడం.. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుతో అల్లుడితో కలిసి మల్లన్న భేటీ కావడం.. ఎంపీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం..
మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం.. తెలంగాణ రాజకీయాల్లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ కాలేజీలో కూల్చివేతలు జరగడం.. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుతో అల్లుడితో కలిసి మల్లన్న భేటీ కావడం.. ఎంపీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం.. ఆ తర్వాత డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం.. ఇలా చకచకా జరిగిన పరిణామాలతో.. మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అనుకున్నారు అంతా ! అలాంటిదేమీ లేదని.. ఆయన పదేపదే చెప్తున్నా.. అనుమానాలు మాత్రం ఆగడం లేదు. ఒకప్పుడు రేవంత్‌కు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన మల్లారెడ్డి.. ప్రస్తుత పరిణామాలతో టెన్షన్ పడిపోతున్నారు. ఐతే రేవంత్ విషయంలో ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. సీఎం రేవంత్ పేరు వింటేనే మల్లారెడ్డి ఆవేశంతో విరుచుకుపడే వాడు.
గతంలో ఆయన్ను రేవంత్ రెడ్డి వేధించాడని పలుసార్లు మీడియాతో చెప్పుకొచ్చాడు. తఐతే మల్లారెడ్డి ఒక్కసారిగా.. సీఎం రేవంత్, నేను ఇద్దరం కలిసి టీడీపీలో ఉన్నప్పుడు మంచి స్నేహితులం అంటూ మాట్లాడి.. ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. గతంలో మీడియా సమక్షంలో చేసిన ఆరోపణలు, తిట్టడం, తొడగొట్టడంలాంటివి అన్నీ.. రాజకీయపరంగా చేసినవే అంటూ చెప్పుకొచ్చారు. అలాగే సీఎం రేవంత్‌తో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి గొడవలు లేవని.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐతే మల్లారెడ్డి మాటలకు ఇప్పుడు నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అంతటివి, ఇంతటివి.. ఇలా ప్లేట్ తిప్పేశావ్ ఏంటి మల్లన్న అంటూ.. సెటైర్లు వేస్తున్నారు. ఐతే రేవంత్ మంట గట్టిగానే పెట్టినట్లున్నారు.. ఆ సెగ తట్టుకోలేక మల్లారెడ్డి తగ్గి మాట్లాడుతున్నారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక అటు తన కొడుకు భద్రారెడ్డి.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ టికెట్ కోసం బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రయత్నాలు చేసిన మాట నిజమేనని.. తాను మాత్రం బీఆర్‌ఎస్‌ను వీడేది లేదని మరోసారి క్లియర్‌కట్‌గా చెప్పారు మల్లారెడ్డి.