Dawood Ibrahim : దావూద్‌ని చంపేశారా ?

దావూద్ ఇబ్రహీం.. ఈ పేరు చెప్తే దానంతట అదే వేగంగా కొట్టుకునే గుండెలు కొన్ని అయితే.. కోపంతో రగిలిపోయే మనసులు మరికొన్ని. బాంబు పేలుళ్లతో బీభత్సం సృష్టించిన దేశాన్ని భయపెట్టిన దుర్మార్గుడు, అండవ్‌ వాల్డ్ మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీం. 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారి. బ్లాస్టింగ్స్ తర్వాత దావూగద్‌ పాకిస్తాన్‌కు పారిపోయాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 01:58 PMLast Updated on: Dec 18, 2023 | 1:58 PM

Did You Kill Dawood The Mastermind Behind The 1993 Mumbai Blasts

దావూద్ ఇబ్రహీం.. ఈ పేరు చెప్తే దానంతట అదే వేగంగా కొట్టుకునే గుండెలు కొన్ని అయితే.. కోపంతో రగిలిపోయే మనసులు మరికొన్ని. బాంబు పేలుళ్లతో బీభత్సం సృష్టించిన దేశాన్ని భయపెట్టిన దుర్మార్గుడు, అండవ్‌ వాల్డ్ మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీం. 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారి. బ్లాస్టింగ్స్ తర్వాత దావూగద్‌ పాకిస్తాన్‌కు పారిపోయాడు. అక్కడే తలదాచుకుంటున్నాడు. భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో అతని పేరుంది. ఎక్కడ ఉన్నాడో తెలుసు.. ఎవరితో ఉన్నాడో తెలుసు.. ఏం చేస్తున్నాడో తెలుసు.. ఎందుకు ఇండియాకు రావడం లేదు అనే ప్రశ్న వేరే ఉన్నా.. ఇప్పుడు దావూద్‌ ఇబ్రహీం మళ్లీ చర్చలోకి వచ్చాడు. దావూద్ ఇప్పుడు చావుబతుకుల్లో ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రెండు రోజుల కిందటే అతను ఆసుపత్రిలో అడ్మిట్ అయినా.. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు అక్కడి అధికారులు. ముంబై పోలీసులకు ఈ సమాచారం అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దావూద్‌ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. కరాచీలోని ఓ ఆస్పత్రిలో ఫ్లోర్‌ మొత్తం ఖాళీ చేసి కేవలం దావూద్‌ ఒక్కడినే ఉంచి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. డాక్టర్లు, ఫ్యామిలీ మెంబర్స్‌కు మాత్రమే ఆ ఫ్లోర్‌కు అనుమతిస్తున్నారు. ఐతే ఈ విషయాన్ని పాకిస్తాన్ అధికారులెవరూ ఇప్పటివరకు ధృవీకరించలేదు. వీటిపై దావూద్‌ సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉండటం, విషప్రయోగం జరిగినట్లు అనుమానాలు వినిపిస్తుండడంతో..

దావూద్‌కు చికిత్స పొందుతున్న ఆసుపత్రి దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కరాచీలోని క్లిఫ్టన్ ఏరియాలో ఉంటున్నాడు దావూద్‌. పాకిస్తాన్‌కు వెళ్లినతర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తానీ పఠాన్ మహిళను వివాహమాడాడు. ఆమె పేరు మైజాబీన్. దావూద్‌ ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మారుఖ్‌.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కొడుకు జునైద్‌ను పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇప్పుడు మియాందాద్‌ ఫ్యామిలీని అక్కడి అధికారులు గృహనిర్భందంలో ఉంచారు. దావూద్‌పై విష ప్రయోగం జరిగిందన్న వార్తతో.. పాకిస్తాన్‌లో కలకలం రేగింది. అయితే ఈ ఘటనతో పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయిందని తెలుస్తోంది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్‌లాంటి నగరాల్లో సర్వర్లు పనిచేయడం లేదు.ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది.