ఫోన్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని తెలుసా…?
ఎంతో ఇష్టంగా, అప్పు చేసి అయినా లేదంటే ఏ రూపంలో అవకాశం ఉంటే ఆ రూపంలో ఓ స్మార్ట్ ఫోన్ కొంటూ ఉంటాం. యాపిల్, స్యామ్సంగ్ కొత్త వెర్షన్లు వచ్చిన ప్రతీసారి ఓ ఫోన్ మనకు ఉండాలనేది ఓ డ్రీం.
ఎంతో ఇష్టంగా, అప్పు చేసి అయినా లేదంటే ఏ రూపంలో అవకాశం ఉంటే ఆ రూపంలో ఓ స్మార్ట్ ఫోన్ కొంటూ ఉంటాం. యాపిల్, స్యామ్సంగ్ కొత్త వెర్షన్లు వచ్చిన ప్రతీసారి ఓ ఫోన్ మనకు ఉండాలనేది ఓ డ్రీం. ఇక ఫోన్ ను అపురూపంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. గీతలు పడకుండా పగలకుండా భారీగానే ఖర్చు చేస్తూ ఉంటారు. అలాంటి ఫోన్ లకు ఎక్స్పైరీ ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు. ఆ తర్వాత ఆ ఫోన్ లు ఆగిపోవడమో స్లో అయిపోవడమో జరుగుతూ ఉంటాయి. అసలు ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటీ…?
సాధారణంగా ఫోన్ పై ఎక్స్పైరీ ఇస్తే ఎవరూ కొనరు. వాటికి ఏడాది వారంటీ ఉంటుందని మాత్రమే తెలుసు. ఎక్స్పైరీ మాత్రం 7 ఏళ్ళ వరకు ఉంటుంది. ఇప్పుడు ప్రముఖ కంపెనీలు యాపిల్, స్యామ్సంగ్ తమ ఫోన్స్ 7 ఏళ్ళ పాటు పని చేసేలా తయారు చేస్తున్నాయి. అలా ఎలా అంటే… ఫోన్ బాక్స్ పై ఉండే ఓఎస్… సెక్యూరిటీ అప్డేట్స్ ముగిసే వరకు ఎక్స్పైరీ ఉంటుంది. ఆ తర్వాత అవి అప్డేట్ అవ్వవు. కొత్త సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. అందుకే ఈ ఫోన్ లో వాట్సాప్ ఆపేశారు, ఈ ఫోన్ లో అప్డేట్ ఆపేశారు అనే వార్తలు చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఐఓఎస్ తీసుకుంటే… ఎక్స్ సీరీస్ నుంచి ఓఎస్ అప్డేట్ అవుతోంది. అది కూడా కొన్ని షరతులతో.