Digvijaya Singh: వైఎస్సార్ విజన్ వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి: దిగ్విజయ్ సింగ్

ఐటీలో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతున్నదంటే దానికి కారణం వైఎస్ విజన్, ఆయన నిర్ణయాలే. హైదరాబాద్‌ గ్లోబల్ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందింది. 3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు ఐటీ సెక్టార్ నుంచే వస్తున్నాయి. తెలంగాణ బాగు కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు‌‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2023 | 03:44 PMLast Updated on: Nov 26, 2023 | 3:44 PM

Digvijaya Singh Said About Telangana It Sector Development

Digvijaya Singh: హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చెందడానికి దివంగత సీఎం వైస్సార్ విజనే కారణమన్నారు కాంగ్రెస్ అగ్రనేత, మధ్య ప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. తెలంగాణ బాగు కోసమే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు దిగ్విజయ్ సింగ్. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. “వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఓఆర్‌ఆర్ ఆయన హయాంలోనే వచ్చింది.

Siddaramaiah: కర్ణాటక రండి.. నిజాలు చూపిస్తాం.. కేటీఆర్‌కు సిద్ధ రామయ్య సవాల్

ఐటీలో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతున్నదంటే దానికి కారణం వైఎస్ విజన్, ఆయన నిర్ణయాలే. హైదరాబాద్‌ గ్లోబల్ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందింది. 3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు ఐటీ సెక్టార్ నుంచే వస్తున్నాయి. తెలంగాణ బాగు కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు‌‌. తెలంగాణలో ఇంకా విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రాజెక్టులను అమలు చేయాల్సి ఉంది. వాటిని అధికారంలోకే వస్తే పూర్తి చేస్తాం. అన్ని వర్గాల బాగు కోసమే సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. కౌలు రైతులకు న్యాయం జరగడం లేదు. వారికీ రైతు భరోసాను అందజేస్తాం. వరికి బోనస్ ఇస్తాం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది. కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారు. మధ్యప్రదేశ్‌లో మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని హామీలనూ అమలు చేశాం. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, కర్ణాటకల్లో ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను అమలు చేశాం. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకూ సమ న్యాయం జరిగేలా, వారి బతుకులు బాగుపడేలా అంబెద్కర్ హక్కులు కల్పించారు. కానీ, ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బీజేపీ బలహీనపరుస్తున్నది. పేదరికం, నిరుద్యోగం భారీగా పెరుగుతున్నది. రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితే ఉంది.

ఎవరూ సంతోషంగా లేరు. రైతులు, నిరుద్యోగులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. పేపర్ లీకులతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారు. ఉద్యోగాలు కల్పించలేదు. 26/11 దాడుల్లో మరణించిన వారికి నివాళులు. రాముడు అందరివాడు. అందరికీ ప్రియమైనవాడు. అందులో రాజకీయాలేమీ లేవు.‌ కానీ, బీజేపీ మాత్రం దర్మం పేరిట దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నది. విభజన రాజకీయాలకు మేము పూర్తిగా వ్యతిరేకం” అని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.