టీ10 లీగ్ లో దినేశ్ కార్తీక్ మరింత క్రేజీగా ఫాస్టెస్ట్ ఫార్మాట్

క్రికెట్ నయా ఫార్మాట్ టీ 10 లీగ్ లో ఈ సారి స్టార్ క్రికెటర్లు సందడి చేయబోతున్నారు. గత సీజన్ తో పోలిస్తే ఈ ఏడాది వరల్డ్ క్రికెట్ లో స్టార్ ప్లేయర్స్ అబుదాబీ టీ టెన్ లీగ్ లో ఆడబోతున్నారు. భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తొలిసారి ఈ లీగ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 17, 2024 | 02:45 PMLast Updated on: Oct 17, 2024 | 2:45 PM

Dinesh Karthik Is The Craziest Fastest Format In T10 League

క్రికెట్ నయా ఫార్మాట్ టీ 10 లీగ్ లో ఈ సారి స్టార్ క్రికెటర్లు సందడి చేయబోతున్నారు. గత సీజన్ తో పోలిస్తే ఈ ఏడాది వరల్డ్ క్రికెట్ లో స్టార్ ప్లేయర్స్ అబుదాబీ టీ టెన్ లీగ్ లో ఆడబోతున్నారు. భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తొలిసారి ఈ లీగ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున మెరుపులు మెరిపించిన డీకే అబుదాబీ టీ10 లీగ్ లో బంగ్లా టైగర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే దినేశ్ కార్తీక్ తో ఆ ఫ్రాంచైజీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన దినేశ్ కార్తీక్ పలు లీగ్స్ లో ఆడుతున్నాడు. లెజెండ్స్ లీగ్ తో పాటు సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ లోనూ అదరగొడుతున్నాడు. ఇప్పుడు క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్ లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. టీ 10 లీగ్ లో భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేసిన డీకే ఫ్యాన్స్ కు ఈ సీజన్ మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

ఇదిలా ఉంటే వచ్చే సీజన్ లో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్, జాస్ బట్లర్, నికోలస్ పూరన్ , కిరణ్ పొల్లార్డ్ , స్టోయినిస్, లివింగ్ స్టోన్ వంటి టీ ట్వంటీ స్టార్స్ ఆడబోతున్నారు. తొలి సీజన్ నుంచి క్రమంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న అబుదాబీ టీ10 లీగ్ లో ఈ సారి రెండు కొత్త జట్లు కూడా చేరాయి. బోల్ట్స్ అజ్మన్, యూపీ నవాబ్స్ టీమ్స్ ఎంట్రీతో ఈ సారి 10 జట్ల మధ్య మెగా లీగ్ జరగబోతోంది. అయితే ఇతర విదేశీ లీగ్స్ తో క్లాష్ కాకుండా షెడ్యూల్ ను కూడా పక్కాగా ప్లాన్ చేశారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 2 వరకూ అబుదాబీ వేదికగా టీ10 లీగ్ ఫ్యాన్స్ ను అలరించబోతోంది. గత సీజన్ లో న్యూయార్క్ స్ట్రైకర్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ సారి న్యూయార్క్ స్ట్రైకర్స్ , డెక్కన్ గ్లాడియేటర్స్, ఢిల్లీ బుల్స్ , టీమ్ అబుదాబీ, నార్తర్న్ వారియర్స్ , మోరిస్ విల్లే సాంప్ ఆర్మీ, బంగ్లా టైగర్స్ , చెన్నై బ్రేవ్ జాగర్స్ తో పాటు యూపీ నవాబ్స్ , బోల్డ్స్ అజ్మన్ సహా 10 జట్లు తలపడనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా టీ ట్వంటీ ఫార్మాట్ స్టార్ ప్లేయర్స్ అందరూ ఈ సారి లీగ్ లో ఆడుతుండడంతో క్రేజ్ మరింత పెరిగింది.