Lokesh Kanakaraj: విజయ్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు
లియో మూవీ ఫస్ట్ డే హిట్ అని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. యూఎస్ లో అయితే థియేటర్స్ లోకూడా విజయ్ ఫ్యాన్స్ మిగతా ఆడియన్స్ తో ఫైట్లు చేసుకుని, ఇండియాలో జరిగే డ్రామా అంతా అక్కడ వరకు తీసుకెళ్లారు. ఎక్కడికెళ్లిన సినిమా పిచ్చోల్లు ఇలానే ఉంటారనేంతగా పరువుతీశారనే కామెంట్స్ పెరిగాయి

ఆసంగతి అటుంచితే, లియో మూవీ ఓపెనింగ్స్ 140 కోట్లు కేవలం యూఎస్ లోనే 2 రోజుల్లో 3 మిలియన్లు అంటే 24 కోట్లు వచ్చాయి. వింటానికి బానే ఉంది. కాని ఎందుకు వరల్డ్ వైడ్ గా 45 శాతంకి పైనే మూడో రోజుకే వసూళ్లు డ్రాప్ అయ్యాయి. అక్కడే ఫ్యాన్స్ లో కూడా రియలైజేషన్ పెరిగింది.
అంతే లోకేష్ మీద సోషల్ మీడియాలో ఎటాక్ పెంచారు. తమ హీరోని ఎందుకు ముంచావని వేసుకుంటున్నారు. ఐతే ఇది దళపతి విజయ్ ఫ్యాన్స్ కాదు తన యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ఎటాక్ అనేది మరికొందరి వాదన. ఆ సంగతి అటుంచితే, నిజంగానే లోకేష్ మాస్టర్ మూవీలో పెద్దగా చెప్పరుకోదగ్గ కంటెంట్ పెట్టలేదు. అలానే లియో కూడా ఎగ్జైట్ చేసే సింగిల్ సీన్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ తో నింపాడు.. ఈ హంగామా వదిలేస్తే కథ, కథనం అంత గొప్పవే కాదు, ఖైదీ, విక్రమ్ తో అసలు పోలికే లేదు. ఆలెక్కన విజయ్ నెందుకు మోసం చేశావంటూ ఆ హీరో ఫ్యాన్స్ లోకేష్ మీద మాటల దాడికి దిగారు. తను సోషల్ మీడియా ఎకౌంట్ క్లోజ్ చేసుకోవాలా అనేంతగా కంగారు పడేలా చేస్తున్నారు.