Devara: ఆలియా ఆగయా..!
త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో ఆలియా జోడీ కడుతుందనుకునే లోపు దేవరకి తను హ్యాండ్ ఇచ్చింది. అలా తన ప్లేస్ లోజాన్వీ కపూర్ వచ్చింది.

Director Koratala Siva is getting ready to cast Alia Bhatt in the climax of Junior NTR's movie Deora.
త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో ఆలియా జోడీ కడుతుందనుకునే లోపు దేవరకి తను హ్యాండ్ ఇచ్చింది. అలా తన ప్లేస్ లోజాన్వీ కపూర్ వచ్చింది. కానీ దేవర మూవీలో రెండో హీరోయిన్ ఉంది ఆ పాత్రకే ఆలియా రానుందని కొత్త ప్రచారం మొదలైంది. దేవర క్లైమాక్స్ లో రెండు సీన్లలో రెండో హీరోయిన్ మెరవాల్సిన అవసరం ఉంటుందట. అలాంటి కీ సీన్ లో మెరిసేందుకు ఆలియా ఓకే చేసిందని తెలుస్తోంది.. కాని అక్కడే చిక్కొచ్చింది.
దేవరలో జాన్వీ మేయిన్ హీరోయిన్ అయితే, ఆలియా సైడ్ హీరోయినా అంటే కానేకాదు. మరి క్లైమాక్స్ లోమెరిస్తే కీ హీరోయిన్ ఎలా అవుతుంది. అంటే, నిజానికి దేవర 1 క్లైమాక్స్ లో దేవర్ 2 కి కంటిన్యూయేషన్ గా సీన్ ఉంటుందట. అక్కడే ఆలియా మెరవబోతోంది. అంటే దేవర 1 లోజాన్వీ కపూర్ హీరోయిన్ అయితే, దేవర2 లో ఆలియా మేయిన్ హీరోయిన్ అట.
అంతవరకు బానే ఉంది కాని, ఇప్పుడు దేవర ఏప్రిల్ 5 కి వస్తుంది. ఈలోగా వార్ 2 షూటింగ్ తో తారక్ బిజీ అవుతాడు. ఆతర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేస్తాడు. సో మరో రెండేళ్ల వరకు దేవర 2 సెట్స్ పైకెళ్లదు.. కాబట్టి దేవర 1 క్లైమాక్స్ లో ఆలియాని చూపించి, దేవర2 లో ఆలియనే హీరోయిన్ అని ముందే కమిటైతే, రెండేళ్ల తర్వాత ఆలియా డేట్స్ ఇవ్వగలదా? తను అప్పడు నో చెబితే ఏంటి పరిస్థితి.. అదే పార్ట్ 1 లోఆలియా కనిపించకపోతే, పార్ట్ 2 తెరకెక్కేప్పుడు ఆలియా డేట్లు దొరికితే ఓకే, లేదంటే మరో హీరోయిన్ తో ముందుకెళ్లొచ్చు.. ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది.. ఐనా కాని కొరటాల శివ ఆలియాని పార్ట్ 1 క్లైమాక్స్ లో చూపించాలనే ఫిక్స్ అయ్యాడట.