Director Jagarlamudi Krish : పరారీలో డైరక్టర్ క్రిష్.. సెల్ సిగ్నల్స్ పై పోలీసుల నిఘా
రాడిసన్ డ్రగ్స్ (Radisson Hotel) పార్టీలో A10 నిందితుడిగా డైరక్టర్ క్రిష్ (Director Jagarlamudi Krish)... నిన్నటి దాకా పోలీసులకు వస్తానని చెప్పి ఇప్పుడు పరార్ అయినట్టు తెలుస్తోంది. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉన్నట్టు సమాచారం. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నట్టు పెడ్లర్ అబ్బాస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.

Director Krish on the run.. Police surveillance on cell signals
రాడిసన్ డ్రగ్స్ (Radisson Hotel) పార్టీలో A10 నిందితుడిగా డైరక్టర్ క్రిష్ (Director Jagarlamudi Krish)… నిన్నటి దాకా పోలీసులకు వస్తానని చెప్పి ఇప్పుడు పరార్ అయినట్టు తెలుస్తోంది. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉన్నట్టు సమాచారం. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నట్టు పెడ్లర్ అబ్బాస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాంతో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. కానీ సడన్ గా ఇప్పుడు క్రిష్ (Krish) కనిపించకుండా పోవడంపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
రాడిసన్ హోటల్ లో రైడ్ జరిగిన రోజున… తాను అర గంట మాత్రమే ఉన్నాననీ… హోటల్ యజమాని వివేకానంద్ కూడా అప్పుడే పరిచయం అయ్యాడని మూడు రోజుల క్రితం మీడియాకి చెప్పాడు డైరెక్టర్ క్రిష్. కానీ అతను ఏడాదిగా డ్రగ్స్ తీసుకుంటున్నాడనీ… తరుచుగా పార్టీలకు అటెండ్ అవుతుంటాడని డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఫిబ్రవరి 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో కూడా క్రిష్ పాల్గొన్నట్టు అబ్బాస్ తెలిపాడు. పేపర్ రోల్‌ని ఉపయోగించి కొకైన్ సేవించినట్టు వివరించాడు. ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో కూడా పేర్కొన్నారు పోలీసులు.
డ్రగ్స్ (Drugs) కేసులో బుధవారమే విచారణకు రావాలని గచ్చిబౌలీ పోలీసులు ఆదేశించారు. తాను ముంబైలో ముఖ్యమైన పనిలో ఉన్నాను. శుక్రవారం వస్తానని చెప్పాడు క్రిష్. కానీ ఇప్పుడు క్రిష్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నట్టు సమాచారం. దాంతో పోలీసులు అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ పై నిఘా పెట్టారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా క్రిష్ ఏ ఏరియాల్లో ఉన్నాడన్నది గుర్తిస్తున్నారు. ఎంక్వైరీకి వస్తానని సడన్ గా ప్లేట్ ఫిరాయించడటంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. డ్రగ్స్ కేసులో దొరికిపోతానన్న భయంతోనే క్రిష్ సడన్ గా మాయం అయ్యారా… లేకపోతే హామీ ఇచ్చినట్టు శుక్రవారం గచ్చి బౌలీ పోలీసుల ముందు హాజరవుతారా అన్నది చూడాలి.