Kamal Hassan: వీళ్ల పని ఔట్
మణిరత్నం మేకింగ్ లో లోకనాయకుడు కమల్ హాసన్ చేయబోయే సినిమా మీద అంచనాలకంటే అనుమానాలే ఎక్కువయ్యాయి.

Director Mani Ratnam is repeating the lead combination with Kamal Haasan
మణిరత్నం మేకింగ్ లో లోకనాయకుడు కమల్ హాసన్ చేయబోయే సినిమా మీద అంచనాలకంటే అనుమానాలే ఎక్కువయ్యాయి. ఎందుకంటే మణిరత్నం ఒకప్పటిలా సినిమాలు తీయట్లేదు. నవాబ్, పొన్నియన్ సెల్వం హిట్టైనా మణిరత్నం స్టాండర్డ్స్ లో కనిపించలేదు. దీనికి తోడు లెజెండ్స్ లాంటి వాళ్ల కాంబినేషన్ రిపీట్ అయిన ప్రతీసారి కోలీవుడ్ లో డిజాస్టర్లే వచ్చాయి.
అందుకు మంచి ఉదాహరణ శంకర్ తో రజినీకాంత్ , విక్రమ్ సినిమాలు. గతంలో రోబో హిట్టైందని, రజినీ కాంత్ తోరోబో 2 తీశాడు శంకర్. ఏమైంది 500 కోట్ల పెట్టుబడి డిజాస్టర్ రిజల్ట్ తో కన్నీరే మిగిల్చింది. అలానే అపరిచితుడు హిట్టైందని ఐ మూవీ తీస్తే విక్రమ్ తో కాంబినేషన్ రిపీట్ చేస్తే శంకర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. విక్రమ్ కెరీరే కొల్లాప్స్ అయ్యింది.
అయినా కమల్ తో శంకర్ భారతీయుడు 2 తీస్తున్నాడు. ఇదే కమల్ తో మణిరత్నం నాయకుడు కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నాడు. అందుకే ఇది మరో నాయకుడు అవుతుందా? లేదంటే కాంబినేషన్ లో ఉన్న ఎమోషన్ కంటెంట్ లో మిస్ అవుతుందా? అన్న డౌట్లకే గేట్లు తెరుచుకుంటున్నాయి.