Ajith-Neel : కేజీయఫ్ 3 హీరో యష్ కాదు అజిత్
దర్శకధీరుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టినట్టే.. కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ సినీ ఇండస్ట్రీని పాన్ ఇండియాకి దగ్గర చేశాడు.

Director Rajamouli has set the Telugu film industry on a pan-India level.
దర్శకధీరుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టినట్టే.. కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ సినీ ఇండస్ట్రీని పాన్ ఇండియాకి దగ్గర చేశాడు. ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ‘కె.జి.యఫ్’ సిరీస్ కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటివరకూ రాఖీ భాయ్ యశ్ కి మాత్రమే పరిమితమైన ‘కె.జి.యఫ్’ యూనివర్శ్ లోకి మరో క్రేజీ స్టార్ ను తీసుకురాబోతున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
తమిళ అల్టిమేట్ స్టార్ అజిత్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే.. వీరిద్దరి కాంబోలో ఒకటి కాదు, రెండు సినిమాలు రూపొందనున్నాయనేదే ఆ న్యూస్. వాటిలో ఒకటి.. ‘కె.జి.యఫ్’ సిరీస్ లోనే రాబోతుందట. ‘కె.జి.యఫ్ 3’ని పట్టాలెక్కించే కంటే ముందే అజిత్ తో ఈ సిరీస్ లో ఒక సినిమా చేయనున్నాడట ప్రశాంత్ నీల్. అజిత్ సినిమాకి కొనసాగింపుగానే.. యశ్ చేసే ‘కె.జి.యఫ్ 3’ ఉంటుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్న వార్త సారాంశం.
మరోవైపు.. ప్రశాంత్ నీల్ కిట్టీలో ‘కె.జి.యఫ్ 3’ మాత్రమే కాదు.. ప్రభాస్ తో ‘సలార్ 2’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తవుతున్నాయి. త్వరలోనే ‘సలార్ 2’తో పాటు.. ఎన్టీఆర్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్రణాళిక చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. మరి.. ఇంత బిజీగా ఉన్న ప్రశాంత్.. ఇప్పట్లో అజిత్ తో సినిమా చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.