Sukumar: పుష్ప 2 నుంచి వీడియో లీక్‌.. 250 లారీలు దింపిన సుకుమార్‌..

సుకుమార్ పుష్ప2 సినిమా కోసం ఈ సారి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 7, 2023 | 02:16 PMLast Updated on: Sep 07, 2023 | 2:16 PM

Director Sukumar Who Unloaded Around 250 Lorries For Pushpa 2 Movie

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ లెక్కల మాస్టార్‌ సుకుమార్‌ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా మీద రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. పుష్ప ది రైస్‌ హిట్‌లో ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్‌ కూడా రావడంతో సినిమా మీద బాధ్యత పెరిగింది. దీంతో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుకుమార్‌. కథలో చాలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌ నుంచి రిలీజైన ఫొటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయ్యాయి.

ఇప్పుడు ఏకంగా ఓ వీడియో లీకైంది. పుష్ప 2 ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ కోసం భారీ యాక్షన్‌ సీన్‌ తీస్తున్నాడట సుకుమార్‌. ఈ సీన్‌లో 250 లారీలతో ఫైట్‌ ఉంటుందట. సినిమా మొత్తాన్ని ఈ సీన్‌ ఐకానిక్‌గా ఉండబోతున్నట్టు సమాచారం. గతంలో లీకైన ఫొటోల్లో కూడా లారీలు కనిపించడం ఇప్పుడు వీడియోలో కూడా భారీ మొత్తంలో లారీలు ఉండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. ఇన్ని లారీలు పెట్టి ఏం ప్లాన్‌ చేస్తున్నావ్‌ మాస్టారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. పుష్ప 2 కథ గురించి దాదాపు అందరికీ ఓ అంచనా ఉంది. కూలీ నుంచి స్మగ్లర్‌గా ఎదిగిన పుష్ప తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు అనేదే పుష్ప 2 స్టోరీ అని సుకుమార్‌ ఇప్పటికే హింట్‌ ఇచ్చారు.

కొంత కాలంగా రిలీజ్‌ అవుతున్న ఫొటోలు, వీడియోలు చూస్తుంటే.. హీరో విలన్స్‌ మధ్య పోరు గట్టిగానే నడిచే చాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. పుష్పతో అల్లు అర్జున్‌ను ఆలిండియా స్టార్‌ చేసిన సుక్కూ.. పుష్ప 2తో ఏ స్థాయికి తీసుకువెళ్తాడో చూడాలి.