Congress Party : కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌లో సీనియర్లకు నిరాశ.. ఏం జరుగుతోంది.. టికెట్ కష్టమేనా..?

వడపోతలు, చాలా ఆలోచనలు, చాలా చాలా అభిప్రాయాలు.. చూశారా ఎన్ని చాలాలు ఉన్నాయో ! ఇన్ని చాలాల మధ్య ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. ఈ జాబితాలో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయ్. 55 మందితో ప్రకటించిన ఈ లిస్ట్‌లో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే తనకే టికెట్ వస్తుందని ఆశించిన వారికి కాకుండా.. వేరే వాళ్ల పేర్లు జాబితాలో ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 15, 2023 | 02:28 PMLast Updated on: Oct 15, 2023 | 2:28 PM

Disappointment For Seniors In The First List Of Congress What Is Happening Is The Ticket Difficult

వడపోతలు, చాలా ఆలోచనలు, చాలా చాలా అభిప్రాయాలు.. చూశారా ఎన్ని చాలాలు ఉన్నాయో ! ఇన్ని చాలాల మధ్య ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. ఈ జాబితాలో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయ్. 55 మందితో ప్రకటించిన ఈ లిస్ట్‌లో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే తనకే టికెట్ వస్తుందని ఆశించిన వారికి కాకుండా.. వేరే వాళ్ల పేర్లు జాబితాలో ఉన్నాయి. కొందరు కాంగ్రెస్ సీనియర్ల పేర్లు కూడా జాబితాలో లేకపోవడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఎలాంటి వివాదాలకు లేని.. ఉన్నా సర్ది చెప్పుకోదగ్గ నియోజకవర్గాలను మాత్రమే.. కాంగ్రెస్ తన మొదటి జాబితాలో పెట్టింది. ఇందులో చాలామంది సీనియర్లకు నిరాశ పరిచింది.

సామాజిక వర్గాల వారీగా చూస్తే 55 మందిలో 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఎస్టీలు ఇద్దరికి చోటు కల్పించారు. 12 మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు. ఓసీలు 26 మంది ఉన్నారు. వెలమ సామాజిక వర్గానికి ఏడుగురురికి, రెడ్డి సామాజికవర్గానికి 17, బ్రాహ్మణ కులానికి చెందిన ఇద్దరు అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. వీరిలో వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో ముస్లింలు ముగ్గురు ఉన్నారు.

సనత్‌నగర్ నుంచి టికెట్ ఆశించిన మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్యకు నిరాశ తప్పలేదు. ఆయనను కాదని అక్కడ కోట నిలిమ అనే మహిళను అభ్యర్థిగా ప్రకటించారు. మరో నేత చెరుకు సుధాకర్‌కి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఆయనకు మొదటి జాబితాలో చోటు దక్కలేదు. మొదట బీఆర్‌ఎస్‌లో ఉన్నా ఆయన.. కేసీఆర్‌తో విభేదించి తెలంగాణ ఇంటిపార్టీ పేరుతో అనే ప్రత్యేక పార్టీ పెట్టి పోరాటం చేశారు. 2022 ఆగస్టులో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. నకిరేకల్‌ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. ఆయనకు బదులు ఈ మధ్యే బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వీరేశానికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

మరో సీనియర్ లీడర్ నాగం జనార్ధన్ రెడ్డికి కూడా నిరాశ తప్పలేదు. ఆయన స్థానంలో రాజేశ్ రెడ్డి కి టికెట్ ఇచ్చారు. మేడ్చల్ సీటు తన వర్గానికి ఇప్పించేందుకు ప్రయత్నించిన మైనంపల్లికి కాంగ్రెస్ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. మరోవైపు మొదటి లిస్టులో తమ పేర్లు ఉంటాయని చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు భావించారు. అలాంటి వారిలో పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. వారి పేర్లు ఈ జాబితాలో లేవు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్, మధుయాష్కీ ఎల్బీనగర్ టికెట్ ఆశిస్తున్నారు. ఆ రెండు టికెట్లను పెండింగ్‌లో పెట్టింది కాంగ్రెస్. ఆ లిస్ట్‌లో బలరాం నాయక్‌, సురేష్ షెట్కార్ కూడా ఉన్నారు.