Fish Prasad : జూన్ 8న HYDలో చేప ప్రసాదం పంపిణీ !
చేప ప్రసాదం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్.. బత్తిన సోదరుల కుటుంబం.. మృగశిర కార్తె సందర్భంగా HYDలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8న ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ..
చేప ప్రసాదం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్.. బత్తిన సోదరుల కుటుంబం.. మృగశిర కార్తె సందర్భంగా HYDలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8న ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో మాదిరిగా.. రూ.15 టోకెన్ తీసుకుని ఒక చేపపిల్లను కొనుక్కోవాలి. చేపతో ప్రసాదం మింగడం ఇష్టం లేనివారికి బెల్లంతో అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రసాదం స్వీకించడానికి ముందు రెండుగంటలు, తర్వాత గంటసేపు పానీయం అల్పాహారం తీసుకోరాదని వెల్లడించారు.
ఈ చేప మందు ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ నుంచి ప్రజలు భారీగా తరలివస్తారు. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోనుంది. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.. ఇందుకోసం ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో.. నాంపల్లి లో వందలాది మంది పోలీసులతో భారీగా బందోబస్తు.. నిఘా ఉంచనున్నారు తెలంగాణ పోలీస్.. లక్షలాది ప్రజలు తరలిరావడంతో.. తొక్కిసలాట, అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Suresh SSM