Vidakula rings : విడాకులకూ ఉంగరాలు వచ్చేసాయి..
ఎంగేజ్‌మేంజ్ రింగ్ గురించి అందరికీ తెలిసిందే.. ఇద్దరి వ్యక్తుల వివాహానికి ముందు జరిపే ఈ వేడుకలో ఎంగేజ్‌మెంట్ రింగ్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ఈ రింగ్ అబ్బాయి, అమ్మాయి చేతికి ఉంటే.. వారి జీవితంలో మరొకరికి ప్రవేశం లేదని చెప్పడానికి అది సంకేతం.. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెళ్లిల్లు, ఎంగేజ్‌మెంట్లను ఎంత గ్రేండ్‌గా సెలబ్రేట్‌గా చేసుకుంటున్నారో.. విడాకులను కూడా అదే రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొందరు. ఈ టైమ్‌లో ఇప్పుడు డివోర్స్ రింగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అమెరికన్ మోడల్ ఎమిలీ రతాజ్కోవ్స్కహాప్ 'డివోర్స్ రింగ్స్' చూపిస్తూ సోషల్ మీడియాలో విడాకులు ప్రకటించింది. దీంతో.. ఇప్పుడు ఇది హాట్‌టాపిక్‌గా మారింది.
ఎంగేజ్‌మేంజ్ రింగ్ గురించి అందరికీ తెలిసిందే.. ఇద్దరి వ్యక్తుల వివాహానికి ముందు జరిపే ఈ వేడుకలో ఎంగేజ్‌మెంట్ రింగ్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ఈ రింగ్ అబ్బాయి, అమ్మాయి చేతికి ఉంటే.. వారి జీవితంలో మరొకరికి ప్రవేశం లేదని చెప్పడానికి అది సంకేతం.. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.
పెళ్లిల్లు, ఎంగేజ్‌మెంట్లను ఎంత గ్రేండ్‌గా సెలబ్రేట్‌గా చేసుకుంటున్నారో.. విడాకులను కూడా అదే రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొందరు. ఈ టైమ్‌లో ఇప్పుడు డివోర్స్ రింగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అమెరికన్ మోడల్ ఎమిలీ రతాజ్కోవ్స్కహాప్ ‘డివోర్స్ రింగ్స్’ చూపిస్తూ సోషల్ మీడియాలో విడాకులు ప్రకటించింది. దీంతో.. ఇప్పుడు ఇది హాట్‌టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం విడాకుల ఉంగరాలు ట్రెండ్ గా మారుతోందని బిజినెస్ వర్గాలు అంటున్నాయి. విడిపోయిన జంటలు ఇటీవల బ్రేక్ అప్ పార్టీలు చేసుకోవడం సర్వసాదారణం అయిపోయాయి. దీంతో.. కొత్తగా విడాకుల ఉంగరాలు తెరపైకి వచ్చాయి!.. వీటికి డిమాండ్ కూడా బాగానే ఉన్నాయంట.. అయితే.. ఇంతకుముందే ఇవి వెస్టర్న్ దేశాల్లో పాపులర్ అయ్యాయట.. న్యూయార్క్ లోని జువెల్లరీ షాపులు 3ఏళ్లుగా డివోర్స్ రింగ్స్, బ్రేకప్ రింగ్స్ తయారు చేస్తున్నాయట..
మారుతున్న కాలంతో పాటు ప్రజల మనస్తత్వాల్లోనూ మార్పులు వస్తున్నాయంఉటన్నారు సైకాలజిస్టులు.. ప్రజలు విడాకులను కొత్త కోణంలో చూడటం ప్రారంభించారంటున్నారు. ఒకరకంగా అది గొప్ప విషయమే పలువురు సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు భాగస్వామికి అవలక్షణాలు ఉన్నప్పటికీ.. ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ.. వివాహ బంధానికి కట్టుబడి ఉండేవారని.. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని చెబుతున్నారు. అది కాస్తా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునేవరకూ వెళ్లిందని అంటున్నారు!. అయితే.. భారత్ వంటి దేశాల్లో మాత్రం ఇలాంటి పద్ధతులపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ.. కాలానుగుణంగా కొత్తకొత్త పద్ధతులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరి.. ఈ డివోర్స్ రింగ్స్, సెలబ్రేషన్స్ మున్ముందు ఇంకెలాంటి కొత్త ట్రెండ్‌కు దారి తీస్తుందో చూడాల్సిందే..