సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్ ఛాన్సుందా ? ఆ వీక్ నెస్ దాటకుంటే కష్టమే
ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ అంచనాలు పెట్టుకున్న జట్లలో కొన్ని ఫ్లాప్ అయితే మరికొన్ని ప్లే ఆఫ్ రేసులో దూసుకెళుతున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు రెండో విజయాన్ని రుచి చూసింది.

ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ అంచనాలు పెట్టుకున్న జట్లలో కొన్ని ఫ్లాప్ అయితే మరికొన్ని ప్లే ఆఫ్ రేసులో దూసుకెళుతున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు రెండో విజయాన్ని రుచి చూసింది. తొలి మ్యాచ్ లో గెలిచిన తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ లలో చిత్తుగా ఓడిన హైదరాబాద్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ పై గెలుపుతో ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది. ఇకపై ఆడే మ్యాచ్ లు ఆరెంజ్ ఆర్మీకి కీలకమే.. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ చేరుకోవాలంటే కనీసం మిగిలిన 8 మ్యాచ్ లలో కనీసం 5 గెలవాల్సి ఉంటుంది. ఆరు గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ పక్కా… కానీ సన్ రైజర్స్ ఆటతీరు చూస్తే మాత్రం ప్లే ఆఫ్ చేరగలదా అనే డౌట్ వస్తోంది. దీనికి ప్రధాన కారణం వారి బ్యాటింగే వారి బలహీనతగా మారింది. ఇప్పటి వరకూ గెలిచిన రెండు మ్యాచ్ లలో సన్ రైజర్స్ విజయాలు బ్యాటింగ్ వల్లనే వచ్చాయి. అది కూడా ఎవరో ఒకరు సెంచరీ బాదితే గెలిచింది. అంటే అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లలో కనీసం ఇద్దరు చెలరేగితే సన్ రైజర్స్ గెలుపు బాట పడుతోంది. ఒకవేళ బ్యాటర్లు ఫెయిలయితే మాత్రం వరుస పరాజయాలే ఎదురవుతున్నాయి. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు నాలుగు మ్యాచ్ లలోనూ ఓడిపోవడానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణం.
బ్యాటింగ్ లో ప్రతీసారీ దూకుడే విజయాలను ఇవ్వదు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ బ్యాటర్లు అర్థం చేసుకోవాల్సిందే… పరిస్థితులకు తగ్గట్టు ఆడకుంటే సిక్సర్లే కొడతామంటే కుదరదు. ఇప్పటి వరకూ గెలిచిన రెండు మ్యాచ్ లూ కూడా ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ పిచ్ పై వచ్చినవే.. ఇప్పుడు ఇతర జట్ల గ్రౌండ్స్ లో బ్యాటింగ్ వికెట్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని పిచ్ లు టూ పేస్డ్ వికెట్ గానూ, మరికొన్ని స్లోగా ఉంటున్నాయి. అలాంటి పిచ్ లపై బ్యాటర్ల దూకుడు పనికిరాదు. అప్పటి పిచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదే సమయంలో బౌలర్లు కూడా ఫామ్ అందుకోవాలి… ఒకప్పుడు సన్ రైజర్స్ అంటే బౌలింగే గుర్తొకొచ్చేది. 120 పరుగుల టార్గెట్ ను కూడా డిఫెండ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సీజన్ లో సన్ రైజర్స్ బౌలింగ్ అత్యంత పేలవంగా ఉంది. జట్టులో వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నా నిరాశపరుస్తున్నారు. కమ్మిన్స్, షమీ, హర్షల్ పటేల్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. షమీ అయితే గత మ్యాచ్ లో ఏకంగా 75 పరుగులు సమర్పించుకున్నాడు. కెప్టెన్ కమ్మిన్స్ కూడా భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. బౌలింగ్ లో ఇప్పటి వరకూ మ్యాచ్ ను గెలిపించిన వారు లేరు. ప్రతీసారీ బ్యాటింగ్ తోనే విజయాలు సాధించలేం.. కొన్ని సార్లు బౌలర్లు కూడా సత్తా చాటాల్సి ఉంటుంది.
షమీ ఫిట్‌నెస్‌పైనా అనుమానాలున్నాయి. రాహుల్ చహర్, ఆడమ్ జంపాకు తోడుగా బ్యాకప్ స్పిన్నర్లు లేరు. జీషన్ అన్సారీకి టీ20ల్లో అనుభవం తక్కువ. టి. నటరాజన్ జట్టు మారడంతో డెత్ ఓవర్లలో రైజర్స్ బౌలింగ్ వీక్ అయిపోయింది. హర్షల్ పటేల్‌కు అనుభవం ఉన్నా.. ఫ్లాట్ పిచ్‌లపై ఇబ్బంది పడుతున్నాడు. ఈ నిలకడ లేని బ్యాటింగ్ , పస లేని బౌలింగ్ తో ప్లే ఆఫ్ చేరుకోవడం కష్టమే… కేవలం 200 ప్లస్ టార్గెట్ ను ప్రత్యర్థి ముందు ఉంచినా సన్ రైజర్స్ బౌలింగ్ తో దానిని కాపాడుకోవడం అసాధ్యం. ఫీల్డింగ్ లో ఇదివరకటి ప్రమాణాలు లేవు. కోల్ కతా మ్యాచ్‌లో కీలకమైన క్యాచ్‌లు జారవిడిచారు. దానికి భారీమూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది. రాబోయే మ్యాచ్‌లు జట్టుకి చాలా కీలకం. బ్యాటింగ్ పై శ్రద్ధ పెట్టాలి. బౌలింగ్ ని మరింత పదును చేసుకోవాలి. ఫీల్డింగ్ లో లోపాలు సరిదిద్దుకోవాలి. లేకుంటే కప్పు సంగతి తర్వాత ముందు ప్లే ఆఫ్ చేరుకునే పరిస్థితి కూడా ఉండదు.