District Collector : అటెండర్ తో బూట్లు మోపిస్తారా ? భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాపై జనం ఆగ్రహం
ఎంత జిల్లా కలెక్టర్ అయితే మాత్రం.. తన చెప్పులు తాను మోసుకోలేడా? దానికి అటెండర్ ను వాడుకోవాలి.. ఆఫీస్ అటెండర్లు ఉన్నది.. ఫైళ్ళు మోయడానికా.. పర్సనల్ పనలు చేయించుకోడానికా.. జనం ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ చర్యలపై మండిపడుతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇప్పుడో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అటెండర్ తో అతను వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. భూపాలపల్లిలో స్థానిక చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు వెళ్ళారు కలెక్టర్ భవేశ్ మిశ్రా. ప్రార్థనామందిరంలోకి బూట్లతోనే వచ్చారు. కానీ బూట్లు వేసుకొని లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదనుకున్నారు. వెంటనే కలెక్టర్ భవేశ్ మిశ్రా.. తన బూట్లు విడిచి అటెండర్ (దఫేదార్ ) కు ఇచ్చారు. ఆయన చర్చిలోపలికి వెళ్ళి వచ్చే దాకా వాటిని అటెండరే పట్టుకున్నారు. కలెక్టర్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అటెండర్లు ఉన్నది ఆఫీసు ఫైళ్ళు మోయడానికి కానీ… ఇలా బూట్లు, చెప్పులు మోయించుకోడానికా.. పర్సనల్ పనులకు వాడుకుంటారా అని మండిపడుతున్నారు. దీనిపై కలెక్టర్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.