Country Name: ఒకదేశం పేరు మార్చాలంటే ఇన్ని వేల కోట్ల ఖర్చా.? గతంలో పేర్లు మార్చిన ప్రాంతాలేవి.?
మన దేశం పేరును మార్చాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందో తెలుసా.. ఈ ఖర్చును ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Do you know how many thousands of crores will be spent if the name India is changed to Bharat?
సాధారణంగా ఒక మనిషి పేరు మార్చుకోవాలంటేనే సవాలక్ష ఐడీ ఫ్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ లు అవసరం అవుతాయి. పైగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులను పదిసార్లు అడిగితే కానీ మన పని పూర్తవ్వదు. అలాంటిది ఒక దేశానికి ఉన్న పేరును మార్చడం అంటే మాటలు కాదు డబ్బుల కట్టలు ఉండే మూటలు కావాలి. దాదాపు 14వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని ఔట్ లుక్ అనే పత్రిక తన నివేదికలో తెలిపింది. పైగా ఒకరోజులో జరిగే పనికాదు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవల్సి వస్తుంది. అలాగే చిన్న వార్డు స్థాయి నుంచే చేపట్టాల్సిన దీర్ఘకాలిక ప్రక్రియ ఇది. దీనికోసం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాడ్ జోష్ గత నెలలో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
మార్కెటింగ్ బడ్జెట్లో 6 శాతం ఖర్చు..
గతంలో ఆఫ్రికాలోని స్వాజిల్యండ్ దేశాన్ని ఎస్వంటిని గా మార్చారు. ఈ ప్రక్రియ 2018 లో జరిగింది. దీనికి మొత్తం 60 మిలియన్ డాలర్లు ఖర్చు అయినట్లు తెలిసింది. ఈ ఖర్చును డారెన్ అలివర్ అనే ప్రముఖ న్యాయవాది తెలిపిన గణాంకాల ఆధారంగా బయటకు వచ్చాయి. ఈయన చెప్పిన లెక్కల ప్రకారం ఒక సూత్రాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఒక దేశంలోని సగటు మార్కెటింగ్ బడ్జెట్ మొత్తం ఆదాయంలో దాదాపు 6 శాతాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే రీ బ్రాండింగ్ కోసం అయితే మొత్తం మార్కెటింగ్ బడ్జెట్ లో 10 శాతం వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సూత్రాన్ని మన దేశంపు గణాంకాల్లో నమోదు చేసి చూద్దాం.
అలివర్ సూత్రాన్ని మన దేశానికి అన్వయిస్తే..
2022-23 లెక్కల ప్రకారం మనదేశ మొత్తం ఆదాయం రూ. 23.84 లక్షల కోట్లు. దీనిని అలివర్ ప్రతిపాదించింన సూత్రంలో పొందుపరిస్తే మన దేశం పేరు మార్చేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలిసిపోతుంది. దీనిని తెలుసుకోవాలంటే ముందుగా మొత్తం రెవిన్యూ, మార్కెటింగ్ బడ్జెట్ ను కనుగొనాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా రీబ్రాండింగ్ మొత్తాన్ని సులువుగా గుర్తించవచ్చు.
మార్కెటింగ్ బడ్జెట్ = 6/100 X రూ. 23.84 లక్షల కోట్లు
రీ బ్రాండింగ్ మొత్తం = 10/100 X రూ. 23.84 కోట్లు
మన దగ్గర మొత్తం రెవిన్యూ = రూ. 23.84 లక్షల కోట్లు
ఇండియా నుంచి భారత్ కు మార్చేందుకు అవసరమైన ఖర్చు = 0.006 X రూ. 23.84 లక్షల కోట్లు
ఇప్పటి వరకూ మారిన నగరాలు..
భారతదేశంలో కొన్ని నగరాలకు, రాష్ట్రాలకు పేర్లను మార్చడం జరిగింది. అలాగే కొన్ని ఒక రాష్ట్రంలో నుంచి వేర్పడ్డాయి. రానున్న రోజుల్లో లక్నోను లక్ష్మణ నగరంగా మార్చేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నాయి ప్రభుత్వాలు. మరి కొందరైతే పోరాట యోధుల పేర్లను కూడా ప్రతిపాదిస్తూ ఉంటారు. అలా ఇప్పటి వరకూ దేశాలు కూడా పేర్లను మార్చుకున్నాయి. శ్రీలంక అసలు పేరు సిలోన్ అయితే 1972లో దీనిని మార్చారు. ఇది శ్రీలంక గా పిలిచేందుకు మూడు దశాబ్దాలు పట్టింది. మన దేశంలో యోగి ఆదిత్యనాథ్ ఒక నగరానికి పేరు మార్చడానికి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
మహారాష్ట్ర లో
ఔరంగాబాద్ నగరం – ఛత్రపతి శంభాజీ నగర్
హోషంగాబాద్ – నర్మదాపురం
ఉత్తరప్రదేశ్ లో
అలహాబాద్ – ప్రయాగ్ రాజ్
లక్నో – లక్షణ నగరం (రానున్న రోజుల్లో)
T.V.SRIKAR