మన ఆడవాళ్ళ దగ్గర ఎన్ని టన్నుల గోల్డ్ ఉందో తెలుసా…?

బంగారం... ఇండియాలో ఇది ఒక ఎమోషన్. ఆ పదం వింటేనే ఆడాళ్ళకు పూనకాలు వస్తాయి. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఇల్లు ఉన్నా లేకపోయినా బంగారం ఉంటే చాలు అని ఫీల్ అవుతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2024 | 09:02 PMLast Updated on: Dec 23, 2024 | 9:02 PM

Do You Know How Many Tons Of Gold Our Women Have

బంగారం… ఇండియాలో ఇది ఒక ఎమోషన్. ఆ పదం వింటేనే ఆడాళ్ళకు పూనకాలు వస్తాయి. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఇల్లు ఉన్నా లేకపోయినా బంగారం ఉంటే చాలు అని ఫీల్ అవుతారు. పెళ్లిలో అబ్బాయి మంచి వాడా…? అమ్మాయి గుణం ఏంటీ అనేది చూడకుండా బంగారం ఎంత పెడుతున్నారని లెక్కలు వేసుకునే బ్యాచ్ ఉంది. అలాంటి బంగారం మన దేశంలో ఎంత ఉందో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపొయింది. ప్రపంచంలోనే బంగారం ఎక్కువగా నిల్వ చేసిన మహిళలు మన ఇండియన్స్.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ లెక్కలను బయటపెట్టింది. భారత మహిళల వద్ద దాదాపు 24,000 టన్నుల బంగారం ఉందని అంచనా వేసింది. ప్రపంచంలో ఉన్న బంగారం నిల్వలో 11 శాతానికి స‌మానం అని తేల్చింది. 5 దేశాల మహిళలతో పోల్చి చూస్తే మన ఆడాళ్ళ దగ్గరే బంగారం ఎక్కువగా ఉంది. అమెరికా (8,000 టన్నులు), జర్మనీ (3,300 టన్నులు), ఇటలీ (2,450 టన్నులు), ఫ్రాన్స్ (2,400 టన్నులు), రష్యా 1,900 టన్నులు) బంగారం నిల్వలు ఉంటే… వారి కంటే ఎక్కువ మన దగ్గరే ఉంది.

అమెరికా, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటే ఐఎంఎఫ్‌, స్విట్జర్లాండ్, జర్మనీల సంయుక్త నిల్వల కంటే ఎక్కువ కావడం షాకింగ్ విషయం. ఇందులో మన సౌత్ ఇండియన్ ఆడాళ్ళదే లీడ్ రోల్. ఇండియాలో ఉన్న మొత్తం బంగారంలో 40 శాతం మన సౌత్ లోనే ఉంది. తమిళనాడులో 28 శాతం గోల్డ్ ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2020-21 లెక్కల ప్రకారం 21,000 నుంచి 23,000 టన్నుల బంగారం ఇండియాలో ఉంటే… 2023 నాటికి ఈ సంఖ్య సుమారుగా 24,000 నుంచి 25,000 టన్నుల వరకు ఉంది.