AP Skill Development Case: కేసు ప్రూవ్ అయితే శిక్ష ఎన్నేళ్లు.. చంద్రబాబుకు బెయిల్‌ కూడా దక్కదా?

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయ్. రెండు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల రోడ్డెక్కాయ్. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకరంగా నినాదాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు.. జగన్ దిష్టిబొమ్మలు దగ్దం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2023 | 03:08 PMLast Updated on: Sep 09, 2023 | 3:08 PM

Do You Know How Many Years The Ap Skill Development Case Is Proven

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయ్. రెండు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల రోడ్డెక్కాయ్. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకరంగా నినాదాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు.. జగన్ దిష్టిబొమ్మలు దగ్దం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా.. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ మీదే చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ వెనక నిజాలేంటి అని కొందరు పోల్స్ పెడుతుంటే.. జగన్ కుట్రలో భాగమా ఇదంతా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఐతే చంద్రబాబు చేసిన పాపం పండిందని.. అందుకే అరెస్ట్ అయ్యారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే.. వైసీపీ రాంగ్‌ స్టెప్‌ తీసుకుందని ఇంకొందరు చర్చ మొదలుపెట్టారు.

ఇదంతా ఎలా ఉన్నా.. చంద్రబాబు మీద కేసు ప్రూవ్ అయితే ఏకంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయ్. సీఐడీ చీఫ్ స్వయంగా చెప్పింది కూడా ఇదే నిజానికి ! చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడటం కూడా అంత ఈజీ కాదని తెలుస్తోంది. గతంలో పలు కేసులపై స్టే తెచ్చుకున్న చంద్రబాబు.. ఈ కేసు విషయంలో స్టే తెచ్చుకునే చాన్స్‌ కూడా లేదు. ఐటీ కేసులో చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని.. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవులు చేపట్టకుండా చంద్రబాబుపై అనర్హత వేటు పడే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో పాటు.. పాటు సాక్షుల వాంగ్మూలం పక్కాగా ఉండటంతో.. ఈ కేసు కారణంగా చంద్రబాబుకు సమస్యలు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయ్.

పన్ను ఎగవేతతో పాటు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ దర్యాప్తునకు కూడా అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితపై ఇదే తరహా కేసులు నమోదు అయ్యాయ్. ఈ కేసు వల్ల మరిన్ని స్కామ్స్ కూడా వెలుగులోకి వఛే చాన్స్ ఉంది. చంద్రబాబు అరెస్ట్ గురించి వైసీపీ నేతలు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. కర్మ అనుభవించక తప్పదని అంబటి కామెంట్ చేయగా… స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉందని బలమైన ఆధారాలు ఉన్నాయని సజ్జల చెప్తున్నారు. ఓవరాల్‌గా ఈ కేసు కారణంగహా చంద్రబాబు రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయ్.