Delhi Liquor Scam Kavita : కవితను అరెస్ట్‌ చేసిన లేడీ ఆఫీసర్‌ బ్యాగ్రౌండ్‌ తెలుసా..?

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్‌ స్కాం (Delhi Liquor Scam). కవిత ఇంట్లో తనిఖీలు చేయాలంటూ వచ్చిన అధికారులు.. అరెస్ట్‌ వారెంట్‌ ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను అరెస్ట్‌ చేస్తున్న టైంలో ఆమె ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2024 | 05:10 PMLast Updated on: Mar 17, 2024 | 5:10 PM

Do You Know The Background Of The Lady Officer Who Arrested Kavitha

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్‌ స్కాం (Delhi Liquor Scam). కవిత ఇంట్లో తనిఖీలు చేయాలంటూ వచ్చిన అధికారులు.. అరెస్ట్‌ వారెంట్‌ ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను అరెస్ట్‌ చేస్తున్న టైంలో ఆమె ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. హరీష్ రావుతో (Harish Rao) సహా కవిత ఇంటికి వచ్చిన కేటీఆర్‌.. ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు తీర్పు పెండింగ్‌లో ఉండగా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ వాదించారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తీసుకువెళ్తారంటూ అధికారులను నిలదీశారు. కానీ కవితను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన లేడీ ఆఫీసర్‌ మాత్రం కేటీఆర్‌కు మాటకు మాట అందించారు. ఆధారాలు లభించాయి కాబట్టే అదుపులోకి తీసుకుంటున్నామంటూ చెప్పారు. గట్టిగా మాట్లాడితే అడగడానికి నువ్వెవరంటూ కేటీఆర్‌ (KTR) ను నిలదీశారు. తన విధులకు అడ్డుపడ్డాడంటూ కేటీఆర్ మీద కేసు కూడా బుక్‌ చేయించారు. ఓ పక్క హరీష్‌ రావు, కేటీఆర్.. మరోపక్క భారీగా బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు. వీళ్లంతా అడ్డుకున్నా.. వాళ్లముందే కవితను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. దీంతో ఎవరీ ఆఫీసర్‌.. ఇండ డ్యాషింగ్‌గా ఉందంటే ఏంటి ఈమె బ్యాంగ్రౌండ్‌ అని అంతా షాకయ్యారు. కవితను అరెస్ట్‌ చేసిన ఈ లేడీ ఆఫీసర్‌ పేరు భానుప్రియ.

ఇండియన్‌ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ అధికారిణి. ఇండియన్‌ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ 2005 కేడర్‌కు చెందిన భానుప్రియ.. స్వస్థం రాజస్థాన్‌లోని కరౌలి. భానుప్రియ తండ్రి, అక్క కూడా సివిల్‌ సర్వీస్‌లోనే ఉన్నారు. తండ్రికి తరచుగా ట్రాన్స్‌ఫర్స్‌ అయిన కారణంగా రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో చదువుకున్నారు భానుప్రియ. కానీ హైయర్‌ ఎడ్యుకేషన్‌ మాత్రం ఢిల్లీలో పూర్తి చేశారు. చిన్నపటి నుంచి తండ్రినీ, అక్కను చూస్తూ పెరిగిన భానుప్రియ తాను కూడా సర్వీస్‌లోకి వెళ్లాని అనుకున్నారు. అనుకున్నట్టుగానే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. 2005లో సివిల్స్‌ క్రాక్‌ చేశారు. మొదల ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ చేసేవారు. అక్కడి నుంచి ఈడీకి షిఫ్ట్‌ అయ్యారు. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో డిప్యుటీ డైరెక్టర్‌గా ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసును మొదటి నుంచీ భానుప్రియే హ్యాండిల్‌ చేస్తున్నారు.

ఇప్పటికే వరకూ అరెస్ట్‌ ఐనవాళ్లను కూడా ఈమే లోపలేశారు. ఇప్పుడు కవిత విషయంలో కూడా కిందిస్థాయి అధికారులను పంపిస్తే పని అవ్వదని తెలిసి.. నేరుగా ఆవిడే వచ్చి కవితను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. అరెస్ట్‌ సమయంలో కేటీఆర్‌తో వాగ్వాదం జరగడం. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌ కావడంతో అంది ఫోకస్‌ ఈ లేడీసింగం మీద పడింది. అంతమంది ఉన్నా ఏమాత్రం భయపడకుండా కవితను తీసుకెళ్లడంతో.. ఎవరీ ఆఫీసర్‌ అని అంతా ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు. ఇదీ ఈడీ డెప్యుటీ డైరెక్టర్‌ భానుప్రియ బ్యాంగ్రౌండ్‌.