Ambani inta pelli : అంబానీ కొడుకు పెళ్లి ఖ‌ర్చు ఎంతో తెలుసా..

పెళ్లి.. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే వేడుక.. లైఫ్ లాంగ్ ఓ స్వీట్ మెమొరీగా మిగిలిపోయే ఈ వేడుకను సామాన్యులు సైతం ఘ‌నంగా జ‌రుపుకోవాల‌ని ఆశిస్తారు. దానికోసం భారీగా ఖ‌ర్చు చేస్తారు. మ‌రి అలాంటిది అంబానీ (Anant Ambani) లాంటి అప‌ర కుబేరుడి ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉంటుంది..? ఆ వేడుకలు, వాటి లెక్క‌లు ఊహ‌కు కూడా అంద‌వు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 2, 2024 | 10:54 AMLast Updated on: Mar 02, 2024 | 10:54 AM

Do You Know The Cost Of Ambanis Sons Wedding

పెళ్లి.. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే వేడుక.. లైఫ్ లాంగ్ ఓ స్వీట్ మెమొరీగా మిగిలిపోయే ఈ వేడుకను సామాన్యులు సైతం ఘ‌నంగా జ‌రుపుకోవాల‌ని ఆశిస్తారు. దానికోసం భారీగా ఖ‌ర్చు చేస్తారు. మ‌రి అలాంటిది అంబానీ (Anant Ambani) లాంటి అప‌ర కుబేరుడి ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉంటుంది..? ఆ వేడుకలు, వాటి లెక్క‌లు ఊహ‌కు కూడా అంద‌వు.. ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్​ను పెళ్లాడనున్నాడు. గుజరాత్​లో జరగనున్న ఈ పెళ్లి కోసం ఎంత ఖ‌ర్చు చేస్తున్నారో తెలిస్తే షాక‌వ్వాల్సిందే.. అంబానీ వార‌సుడి పెళ్లి కోసం ఏకంగా వెయ్యి కోట్ల రూపాయ‌ల‌ను కోట్లు ఖర్చు పెడుతున్నారని టాక్ ఇప్పుడు సెన్సేష‌న్‌గా మారింది. ఈ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే.. ఇన్ని కోట్లు ఖర్చు చేసినా అంబానీకి పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్న సంపాదనలో ఇది కేవలం 0.1 శాతం మాత్రమే మ‌రి..

ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న మూడు రోజులు ప్రీ వెడ్డింగ్ వేడుక -పెళ్లికి కి కేటాయించిన బ‌డ్జెట్ అది అని తెలుస్తోంది. ఇంకా పెళ్లి వ‌స్త్రాలు ..షాపింగ్ ఖ‌ర్చులు కోట్ల‌లో ఉంద‌ని అంటున్నారు. పెళ్లి రోజున అనంత్ అంబానీ బంగారం తో త‌యారు చేయించిన దుస్తుల్ని ధ‌రిస్తాడంటూ ఓ న్యూస్ వైర‌ల్ అవుతోంది. ఇక‌.. అనంత్ అంబానీ-రాధిక వెడ్డింగ్ వేడుక‌ల్లోనే కాదు.. ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల్లోనూ ఫుల్ రిచ్‌నెస్ క‌నిపిస్తోంది. వరల్డ్​లోని టాప్ మోస్ట్ సెలబ్రిటీలు అంతా ఆయన ఇంట సందడి చేయడానికి అప్పుడే గుజ‌రాత్‌కు వచ్చేసారు.. ఇక‌.. టాలీవుడ్ నుంచి మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న కూడా ఈ గ్రాండ్ సెల‌బ్రేష‌న్స్‌లో భాగ‌మైపోయారు..

కాగా.. అనంత్ అంబానీ-రాధిక ల వివాహానికి ముందే అంబానీ ఫ్యామిలీ ఓ భారీ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. సుమారు పద్నాలుగు దేవాలయాల నిర్మాణాన్ని చేపట్టారు అంబానీ కుటుంబ‌స‌భ్యులు.. ఇండియాలో లో అతి పెద్ద ఆలయంగా పేరు తెచ్చుకుంటున్న రామ మందిరం , అమెరికాలో బాప్స్ టెంపుల్.. ఎలా అయితే ప్రసిద్ధి చెందాయో.. అదే తరహాలో అంబానీ ఫ్యామిలీ కట్టించబోయే ఆలయాలు కూడా అభివృద్ధిలోకి రానున్నాయి. అంతేకాకుండా.. ప్రప్రాంచవ్యాప్తంగా ఉన్న అంబానీ ఫ్యామిలీ కి సంబంధించిన వారి ఇళ్లలో కూడా.. పూజ గదులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా ముంబై , లండన్ లలో ఉండే ఇళ్లలో చిన్న గుడి కూడా ఉంటుంది. ఇక ప్రస్తుతం గుజరాత్ లోని అంబానీ కుటుంబానికి.. కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన జామ్ నగర్ లో 14 ఆలయాల నిర్మాణంతో సరికొత్త ఆధ్యాత్మిక శోభను తీసుకురానున్నారు. త‌మ కుమారుడి పెళ్లి సంద‌ర్భంగా అంబానీ ఫ్యామిలీ చేస్తున్న ప‌నిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇది క‌దా అంబానీ రేంజ్ అంటే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అనంత్ అంబానీ-రాధిక‌ల వెడ్డింగ్ ఈవెంట్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారిపోయింది.