Ram Charan : రామ్ చరణ్ కూతురు కేర్ టేకర్ నెల జీతం ఎంతో తెలుసా?
రామ్ చరణ్(Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల కూతురు క్లింకార (Klinkara) పాప పుట్టిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియాకు, తమ అభిమానులకు చూపించకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఫ్యామిలీ ఫోటోలలో సైతం ఎమోజీలు పెట్టి పిక్స్ విడుదల చేస్తున్నారు.

Do you know the monthly salary of Ram Charan's daughter's caretaker?
రామ్ చరణ్(Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల కూతురు క్లింకార (Klinkara) పాప పుట్టిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియాకు, తమ అభిమానులకు చూపించకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఫ్యామిలీ ఫోటోలలో సైతం ఎమోజీలు పెట్టి పిక్స్ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పాపకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. క్లిన్ కారను చూసుకునే కేర్ టేకర్‌కు లక్షల్లో జీతాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది.
కొద్ది రోజుల క్రితం ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చిన చరణ్ దంపతులతో పాటు కేర్ టేకర్ సావిత్రి కూడా కనిపించారు. ఇది వరకు సావిత్రి బాలీవుడ్ (Bollywood) లోని పలువురి బిగ్ షాట్స్, స్టార్స్ బిడ్డలను తన చేతుల్లో పెంచింది.గతంలో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ కొడుకు తైమూర్ ఆలనాపాలనా సావిత్రే (Savitri) నే చూసింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇంట్లో కూడా వర్క్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్‌లోని రామ్ చరణ్ ఇంట్లోకి వచ్చారు.
ముంబాయిలో నివాసం ఉంటున్న సావిత్రిని క్లింకార కోసం ప్రత్యేకంగా రప్పించారు. ఇక పాపను చూసుకునేందుకు సావిత్రికి లక్షన్నర వరకు జీతం ఇస్తున్నారట. చరణ్‌కు చేతినిండా సినిమాలు, ఉపాసనకు ఒకవైపు అపోలో ఆసుపత్రి, మరో వైపు సేవాకార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో చిన్నపిల్లల గురించి అన్నీ తెలిసిన సావిత్రినే కరెక్ట్ అని, తన కోసం అంత ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. మెగా ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉండడంలో ఆశ్చర్యం ఏముంది అని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.