అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా
అమెరికా అంటేనే ప్రపంచంలో అగ్రదేశం. ఏ మూల ఏం జరిగినా అమెరికా జోక్యంతో పరిస్థితి సర్దుకుంటుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉండటం అంటే.. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్నట్టే. అందుకే ఆ దేశంలో జరిగే ఎన్నికలను ప్రపంచం మొత్తం గమనిస్తుంది.
అమెరికా అంటేనే ప్రపంచంలో అగ్రదేశం. ఏ మూల ఏం జరిగినా అమెరికా జోక్యంతో పరిస్థితి సర్దుకుంటుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉండటం అంటే.. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్నట్టే. అందుకే ఆ దేశంలో జరిగే ఎన్నికలను ప్రపంచం మొత్తం గమనిస్తుంది. ఈ ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోటీ తరువాత కమళా హ్యారిస్‌ప డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. త్వరలో మరోసారి అధ్యక్ష హోదాలో వైట్ హౌజ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిని ప్రభుత్వం నుంచి వచ్చే జీతం ఎంత, ఎలాంటి అలవెన్స్‌లు ఉంటాయి అనే విషయాలు వైరల్ అవుతున్నాయి. అమెరికాలో అధ్యక్షుడి జీతం సాధారణ పౌరుడి సగటు జీతం కంటే ఆరు రెట్లు ఎక్కువ. అతనికి ఏడాది 4.4 లక్షల డాలర్లు అందుతుంది అంటే మన కరెన్సీలో దాదాపుగా 3 కోట్ల 36 లక్షలు. ఖర్చులకు మరో 50 వేల డాలర్లు అంటే 42 లక్షలు పొందుతారు.
అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్‌లో ఉచిత నివాస సదుపాయం ఉంటుంది. వినోదం కోసం, సిబ్బంది, వంటవారు ఇలా పలు అవసరాలకోసం ఏడాది 19 వేల డాలర్లు అంటే 16 లక్షలు అదనంగా ఇస్తారు. ఉచిత ఆరోగ్య సేవలు లభిస్తాయి. ప్రయాణ ఖర్చుల కోసం పన్నులు వేయని లక్ష డాలర్లు అంటే మన కరెన్సీలో 84లక్షలు ఇస్తారు. ఈ వార్షిక వేతనాన్ని జార్జ్ డబ్ల్యూ బుష్ అధికారం చేపట్టడానికి ముందు 2001లో యూఎస్ కాంగ్రెస్ చివరిసారిగా పెంచింది. యూఎస్ అధ్యక్షుడిగా వైదొలిగిన తరువాత అదనపు పెన్షన్ లాంటి ఇతర ప్రోత్సాహకాలనుకూడా అందుకుంటారు. అయితే, యూఎస్ ప్రథమ మహిళలకు ఎలాంటి జీతం అందదు. యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత వైట్ హౌస్ రీమోడలింగ్ కోసం లక్ష డాలర్లు అందుకుంటారు. అయితే.. బరాక్ ఒబామా వంటి పలువురు అధ్యక్షులు ఆ డబ్బును ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు. బదులుగా వారి సొంత ఖర్చులతో వైట్ హౌస్ రీ మోడలింగ్ చేయించుకున్నారు.