Salar : బాక్సాఫీస్‌పై సలార్‌ దండయాత్ర.. సలార్‌ సెకండ్‌ డే కలెక్షన్‌ ఎంతో తెలుసా..?

భారత్‌లో ఏ సినిమా లవర్‌ని పలకరించినా ఇప్పుడు వినిపించే పేరు సలార్‌ మాత్రమే. చాలా గ్యాప్‌ తరువాత.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అతన్ని ఎలా చూడాలి అనుకున్నారో అలా చూశారు. కేజీఎఫ్‌ లాంటి భారీ హిట్‌ తరువాత.. ప్రశాంత్‌ నీల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా సలార్‌ సినిమాను తీశాడు. వరుస ఫ్లాపుల తరువాత ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్ లాంటి సినిమా ఇచ్చాడు ప్రభాస్‌. దీంతో రిలీజ్‌ ఐన మొదటి రోజే బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది సినిమా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 24, 2023 | 03:45 PMLast Updated on: Dec 24, 2023 | 3:45 PM

Do You Know The Second Day Collection Of Salar

 

భారత్‌లో ఏ సినిమా లవర్‌ని పలకరించినా ఇప్పుడు వినిపించే పేరు సలార్‌ మాత్రమే. చాలా గ్యాప్‌ తరువాత.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అతన్ని ఎలా చూడాలి అనుకున్నారో అలా చూశారు. కేజీఎఫ్‌ లాంటి భారీ హిట్‌ తరువాత.. ప్రశాంత్‌ నీల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా సలార్‌ సినిమాను తీశాడు. వరుస ఫ్లాపుల తరువాత ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్ లాంటి సినిమా ఇచ్చాడు ప్రభాస్‌. దీంతో రిలీజ్‌ ఐన మొదటి రోజే బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది సినిమా. 2023లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా నిలిచింది. సలార్‌ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 178 కోట్ల కలెక్షన్‌లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా వరుసగా అదే ర్యాంపేజ్‌ కంటిన్యూ చేస్తోంది. రెండో రోజు కూడా సలార్‌ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. సెకండ్‌ డే సలార్‌ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 117 కోట్ల కలెక్షన్‌ వచ్చింది. ఈ సంవత్సరం రిలీజ్‌ ఐన అన్ని సినిమాల్లో ఇంత భారీ స్థాయిలో కలెక్షన్‌లు రాబట్టిన సినిమా సలార్‌ మాత్రమే.

సినిమా రిలీజ్‌ అయ్యాక లాంగ్‌ వీకెండ్‌ రావడం సినిమాకు బాగా కలిసి వచ్చిన అంశం అంటున్నారు ట్రేడ్‌ నిపుణులు. ఇప్పటికే రెండు రోజుల కలెక్షన్స్‌ కలిపి సినిమా 295 కోట్లు క్రాస్‌ చేసింది. ఇక వరుసగా హాలీడేస్‌ ఉన్న కారణంగా కలెక్షన్‌ మరింతం భారీ స్థాయిలో పెరిగే చాన్స్‌ ఉంది అంటున్నారు. సినిమా ప్రేక్షకుల ఎక్స్‌పెక్ట్‌ చేసిన రేంజ్‌లో ఉండటం. చాలా కాలం తరువాత ప్రభాస్‌ మాస్‌ కటౌట్‌లో బీభత్సం చూపిండంతో ఆడియన్స్‌ సినిమాకు క్యూ కడుతున్నారు. కేవలం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు. నార్మల్‌ సినిమా ఫ్యాన్స్‌ కూడా సలార్‌ సినిమాను ఒకటికి రెండు సార్లు చూస్తున్నారంటూ పబ్లిక్‌కు సినిమా ఏ రేంజ్‌లో కనెక్ట్‌ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి కాటేరమ్మ కొడుకు చేస్తున్న ఈ బాక్సాఫీస్‌ దండయాత్ర ఏన్ని వందల కోట్ల వరకూ వెళ్లి ఆగుతుందో.