దీపం త్వరగా కొండెక్కినా.. వత్తులు పూర్తిగా కాలిపోయినా ఏం జరుగుతుందో తెలుసా!
దీపం.. త్రిమూర్తి స్వరూపం, దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. దీపంలోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీమహావిష్ణువుకి... తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీక. దీపారాధన చేయడం వల్ల త్రిమూర్తులను పూజించినట్టు అవుతుంది.
దీపం.. త్రిమూర్తి స్వరూపం, దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. దీపంలోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీమహావిష్ణువుకి… తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీక. దీపారాధన చేయడం వల్ల త్రిమూర్తులను పూజించినట్టు అవుతుంది. అందుకే… ఇంట్లో ప్రతిరోజూ దీపారాధన చేస్తుంటాం. ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం హిందూ సాంప్రదాయం. ఇంట్లో రెండు పూటలా దీపారాధన చేస్తే.. ఐశ్వర్యదాయమని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి.
దీపం తేజస్సుకు ప్రతీక. అందుకే మనం దీపప్రజ్వలన అని కాకుండా… దీపారాధన అంటున్నాం. అలా అనడంలోనూ ఒక పరమార్థం ఉంది. దీపాన్ని వెలిగించాలని అని కాకుండా… దీపాన్ని పూజించండి అని మన పెద్దలు చెప్తున్నారు. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన ఉంటుందో… ఆ ఇంట్లో సకలదేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. ఆ ఇంట శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుందని రుగ్వేదం చెప్తోంది. గృహస్తు ధర్మం ప్రకారం… సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి.. దేవుడి ముందు దీపారాధన చేయాలి. అలాగే.. , సూర్యాస్తమయంలోనూ కూడా దీపారాధన చేయాలి. దైవ సన్నిధిగా భావంపబడే పూజాగదిలో దీపం వెలిగింది.. నిర్మలమైన మనస్సుతో భగవంతుడిని ధ్యానించాలి. పూలు, ఫలాలు నైవేద్యంగా సమర్పించాలి. పండ్లు సమర్పించే స్తోమత లేని వారు.. పటికబెల్లమైనా నివేదించాలి. నిత్యదీపారాధన చేసి వారి పట్ల… దేవతులు ప్రసన్నంగా ఉంటారని గ్రంథాలు చెప్తున్నాయి.
దీపారాధన ఎందుకు చేయాలి..?
దీపారాధనలో చాలా పరమార్థం ఉంది. ప్రమిద శరీరానికి ప్రతీక. అందులో వేసే నూనె లేదా నెయ్యి… మనలోని ప్రేమ వంటిది. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే స్నేహం. సోదరుల యందు ఉంటే ఆదరణ. అదే పెద్దల ముందు ఉంటే గౌరవం. భగవంతుని ముందు ఉంటే భక్తి. ఈ ప్రేమ భగవంతుడి కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. మన మనస్సుని పాత్రను చేసి, మన ప్రేమనే నెయ్యిగా పోసి, మనం భగవంతుడి కోసం చేసే చింతనలే వత్తులు… మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి. అన్నింటిని కలిపి పరమాత్మమయం చేయడమే దీపం పెట్టడంలో ఉండే ఆంత్యరం.
దీపారాధన త్వరగా కొండెక్కితే ఏమవుతుంది..?
అగ్నిహోత్రుడిని ఆవాహన చేసి వెలిగించేదే దీపారాధన. దీపాన్ని వెలిగించేటప్పుడు.. అగ్రిహోత్రుడు జ్యోతిలోకి వచ్చి ఉంటాడు. దీపారాధన చేయగానే కొండెక్కితే… దీపాన్ని మనం సరిగా వెలిగించలేదని అర్థం. అప్పుడు… మరోసారి దీపాన్ని దేవుడ్ని స్మరించుకుంటూ వెలిగించవచ్చు. దాని వల్ల పెద్దగా ఇబ్బంది లేదని పండితులు చెప్తున్నాయి. అయితే… దీపారాధన చేసిన తర్వాత కొంచెం చేసు బాగా వెలిగి మధ్యలో కొండెక్కిపోతే… అది కూడా ప్రమిదలో నూనె ఉండి… వత్తులు కూడా బాగానే ఉండగా… దేపం కొండెక్కితే.. ఆలోచించాల్సిన విషయమని అన్నారు. ఇందులో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవి… అయితే.. దీపం అలా కొండెక్కిన రోజు… ఇంట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అది తప్ప… పెద్దగా వచ్చే సమస్యలు ఏమీ ఉండవన్నది పండితుల మాట.
దీపంలోని వత్తులు పూర్తి కాలిపోతే ఏం జరుగుతుంది..?
దీపారాధన చేశాక… దీపం సరిగా వెలగపోయినా… వత్తులు సరిగా కాలకపోయినా లేదా… వత్తులు పూర్తిగా కాలిపోయినా… ఎన్నో సందేహాలు వస్తాయి. దేవుడికి మనపై కోసం వచ్చిందనే… దేవుడి అనుగ్రహం మనకు లేదనే అనుకుంటూ ఉంటారు చాలా మంది. లేదా… ఇంట్లో ఏదో దోషం ఉందని భయపడిపోతుంటారు. అయితే… భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు. వత్తులు అంటే…శ్రేష్ఠమైన పత్తితో చేసుకుండాలి. కానీ.. ఇప్పుడు మార్కెట్‌లో దొరికేవి శ్రేష్ఠమైన పత్తితో చేసినవో లేదో ఎవరికీ తెలిదీ. పైగా… పూజాద్రవ్యం… ఇది కూడా స్వచ్ఛమైనది మార్కెట్‌లో దొరుకుందో లేదో లేదు. ఆవునెయ్యితో దీపం పెట్టాలని అంటారు. మార్కెట్‌లో దొరికే ఆవునెయ్యి… స్వచ్ఛమైనదేనా..? ఏమో ఎవరికి తెలుసు. అందుబాటులో ఉన్న వాటిని తీసుకొచ్చి.. భక్తితో మనం దీపం వెలిగిస్తుంటాం. భగవంతుడు కూడా మనలోని భక్తిని చూస్తాడే తప్ప… పదార్థాన్ని కాదు అని వేదపండితులు చెప్తున్నారు. దీపం మధ్యలో కొండెక్కితే… బాధపడాల్సిన అవసరం లేదని… అయితే… దీపంలో మిగిలిన నూనెతో మరసటి రోజు దీపారాధన చేయకుండా… దీపపు కుందెనలు శుభ్రం చేసుకుని… దీపారాధాన చేస్తే మంచిదని చెప్తున్నారు. వత్తులు పూర్తి కాలిపోయినా… వచ్చే ఇబ్బంది ఏమీ లేదంటున్నారు. దీపం ఎక్కువ సేపు ఉంది… తక్కువ సేపు ఉంది అనే ఆలోచనే వద్దని చెప్తున్నారు. మనం వాడే వస్తువుల క్వాలిటీని భట్టే దీపం చివరి వరకు ఉండటమా…? వత్తులు పూర్తిగా కాలిపోవడమా..? మధ్యలోనే కొండెక్కడమా..? అనేది జరుగుతుందని అంటున్నారు. కనుక… దీపం కొండెక్కినా..? వత్తులు పూర్తిగా కాలిపోయినా…? వత్తులు సగం వరకే కాలినా..? భయపడాల్సి అసవరం లేదంటున్నారు. దేహ శుద్ధి, ఆత్మ శుద్ధి ఉందా లేదా అన్నదే… మనం చూసుకోవాలి. ఆత్మను.. భగవంతుడికి అర్పించి… పూజ చేసుకోవాలి.