KCR : ఎందుకు ఓడిపోయారో తెలిసిందా ? 170 కారణాల్లో అసలైనవి లేవేంటి ?
ఇకపై పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు... లోక్ సభ అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలను తీసుకుంటాం... ఇది BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్సే... అయ్యో... కేసీఆర్ ఓడిపోతాడు అనుకులేదని చాలామంది చెప్పారని అంటున్నారు కేటీఆర్. నిజంగా ఆయన చెప్పినట్టు... ఇక మీద పార్టీలో ఆ నలుగురు చెప్పిందే వేదం కాకుండా... అందన్నీ కలుపుకుపోతారా...
ఇకపై పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు… లోక్ సభ అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలను తీసుకుంటాం… ఇది BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్సే… అయ్యో… కేసీఆర్ ఓడిపోతాడు అనుకులేదని చాలామంది చెప్పారని అంటున్నారు కేటీఆర్. నిజంగా ఆయన చెప్పినట్టు… ఇక మీద పార్టీలో ఆ నలుగురు చెప్పిందే వేదం కాకుండా… అందన్నీ కలుపుకుపోతారా… లేదా ఇప్పుడు చెప్పిందంటా బిల్డప్పేనా ?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి 170 కారణాలు ఉన్నాయట. బుధవారం నాడు తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సమీక్ష తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పిన మాట ఇది. ఈ కారణాల్లో పార్టీలో అంతర్గత సమస్యలు, పార్టీ పటిష్టంగా లేకపోవడం, ఎమ్మెల్యేలపై జనంలో వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్దాల వల్లే జనం బీఆర్ఎస్ ను ఓడించినట్టు చెప్పారు. అంటే తమ పార్టీ ఓటమికి స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యేల కారణమే తప్ప… తాము కాదు అన్నట్టుగా ఉంది కేటీఆర్ ధోరణి.
నిజానికి బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత… ఈ నలుగురే అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ అయితే జనంతో కలవరు… ఎమ్మెల్యేలను దగ్గరకు రానీయరు… రాష్ట్రంలో ఎంత పెద్ద సంఘటన జరగనీయండి… మీడియాకు అదో పెద్ద బ్రేకింగ్ న్యూసే గానీ… నాకు మాత్రం కాదు అన్నట్టుగా ఉంటుంది కేసీఆర్ వ్యవహారం. ఇక కేటీఆర్ మాత్రం… ఏదైనా ఇష్యూ అయితే దాన్ని పక్కదారి పట్టించడానికి… ప్రతిపక్షాల మీద బురద జల్లడానికే ప్రయత్నించేవారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో… బంధుప్రీతి, అంతులేని అవినీతి ఆరోపణలు, అహంకారం… తాము చెప్పిందే నడవాలి అనే ఏకపక్ష ధోరణి, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లే కాదు… ఎన్నుకున్న ప్రజలను కూడా ఖాతర్ చేయకపోవడం ఇవన్నీ కారణాలే. మరి ఈ 170 కారణాల్లో ఇవి ఉన్నాయో లేదో మరి.
కేసీఆర్ ఓడిపోతాడని అనుకోలేదని చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నారని కేటీఆర్ చెబుతున్నారు. తెలంగాణకు తాము తప్ప ఏ పార్టీ పని చేయదు… తెలుగువారంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుకొస్తారో… తెలంగాణ అంటే కేటీఆర్ అని గొప్పలు చెప్పుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ… తెలంగాణ కోసం ఏమీ చేయలేదన్నారు. కానీ ఆ రెండు పార్టీలు కలసి రాకపోతే అసలు తెలంగాణయే ఏర్పడేది కాదన్నది కేటీఆర్ మర్చిపోతున్నారు. నిజంగా తెలంగాణలో ఎలాంటి అవినీతి, అహంకారం, బంధుప్రీతి లేకుండా… ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా కేసీఆర్ స్పందించి ఉంటే… జనం మళ్ళీ బీఆర్ఎస్ ను ఎందుకు గెలిపించలేదు. మరి మిగతా రాష్ట్రాల్లో క్లీన్ చిట్ గా ఉండి ఏళ్ళ తరబడి ముఖ్యమంత్రులుగా పనిచేసిన కమ్యూనిస్టు, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎంతమంది లేరు. అంతెందుకు మన పక్కన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వరుసగా ఎందుకు గెలుస్తున్నారు. కేసీఆర్ ఎందుకు గెలవలేదు. నిజంగా తెలంగాణని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే… ఇక్కడి జనాన్ని వదిలేసి… భారత రాష్ట్ర సమితి పేరుతో పక్క రాష్ట్రాలపై ఎందుకు పడ్డారు. ఇక్కడి జనం డబ్బులతో…కాన్వాయ్ లు, బస్సులు వేసుకొని పొరుగు రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళినట్టు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను రేవంత్ సర్కార్ దెబ్బతీస్తోందని కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. కానీ ఇటీవల కాలంలో ఫాల్కాన్, అదానీ, అమరరాజా లాంటి కంపెనీల ప్రతినిధులు వచ్చి రేవంత్ ను ఎందుకు కలుస్తున్నారు. కాంగ్రెస్ వస్తే అభివృద్ధిని కోరుకోదా… అదేదో బీఆర్ఎస్ కి మాత్రమే కాపీ రైట్ అన్నట్టుగా ఉంది వాళ్ళ ధోరణి. ఇప్పటికైనా జనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టినందున…. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలుకు ఒత్తిడి చేయడం, జనం సమస్యలను హైలెట్ చేయడంపై అయినా దృష్టిపెట్టాలి. ఇంకా మేమేదో చేశాం… మేం లేకపోతే తెలంగాణకు గడవదు అన్న ధోరణి తగ్గించుకుంటే బెటరేమో.