Heart Attack: 16 వేల హార్ట్‌ ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ హార్ట్‌ ఎటాక్‌తో మృతి

కత్తి పట్టినోడు కత్తికే బలి అవుతాడు. గన్‌ పట్టుకున్నోడు ఆ గన్‌తోనే మట్టిలో కలిసిపోతాడు. అలాగే 16 వేల మందికి హార్ట్‌ ఆపరేషన్లు చేసిన ఓ డాక్టర్‌ హార్ట్‌ ఎటాక్‌తోనే చనిపోయాడు. కంపేరిజన్‌ కాస్త అటూ ఇటూగా ఉన్నా.. ఎమోషన్‌ మాత్రం చాలా పెయిన్‌ఫుల్‌. ఈ మధ్య హార్ట్‌ ఎటాక్‌లు అందరినీ తెగ టెన్షన్‌ పెట్టేస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 7, 2023 | 05:59 PMLast Updated on: Jun 07, 2023 | 5:59 PM

Doctor Gandhi Died With Heart Attack

డాన్స్‌ చేస్తున్నవాళ్లు చేస్తున్నట్టే.. క్రికెట్‌ ఆడుతున్నవాళ్లు ఆడుతున్నట్టే కుప్పకూలిపోయిన ఘటనలు ఎన్నో. ఏజ్‌తో సంబంధం లేకుండా.. ఫిట్‌నెస్‌తో అవసరం లేకుండా హార్ట్‌ ఎటాక్‌లు వస్తున్నాయి. కామన్‌ పీపుల్‌ నుంచి సెలబ్రెటీల వరకూ చాలా మంది హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయారు. నిన్నటి వరకూ మన మధ్యే నవ్వుకుంటూ ఉన్న చాలా మంది తెల్లారేసరికే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి.

కానీ ఎంతో మందిని హార్ట్‌ ఎటాక్‌ల నుంచి, గుండె సంబంధింత వ్యాధుల నుంచి కాపాడిన డాక్టర్‌ గాంధీ.. అదే హార్ట్‌ ఎటాక్‌కు బలి అవ్వడం చాలా బాధాకరం. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో డాక్టర్‌ గాంధీ చాలా ఫేమస్‌. మంచి కార్డియాలజిస్ట్‌గా గాంధీకి పేరుంది. ట్రీట్‌మెంట్‌ మాత్రమే కాదు. హార్ట్‌ ఎటాక్‌ రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలు వివరించడంతో కూడా గాంధీ నిష్ణాతుడు. సోషల్‌ మీడియా, అవగాహనా కార్యక్రమాల్లో హార్ట్‌ ఎటాక్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎన్నో లెక్చర్లు ఇచ్చారు.

సోషల్‌ మీడియాలో కూడా చాలా వీడియోలు చేసేవారు. అంత టాలెంట్‌ ఉన్న వ్యక్తి అంటే ఖచ్చితంగా గుండెకు సంబంధించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. కానీ అలాంటి వ్యక్తే తనకొచ్చే గుండెపోటును ఆపలేకపోయాడు అంటే కామన్‌ పీపుల్‌ పరిస్థితి ఏంటా అనే చర్చ మొదలైంది. దీనికి తోడు కరోనా టీకాల టెన్షన్‌ అందరినీ వణికిస్తోంది. ఆ మధ్య హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన చాలా మంది గతంలో కరోనా టీకా తీసుకున్నవాళ్లే. దీంతో వరుస హార్ట్‌ ఎటాక్‌లకు కరోనా టీకాలే కారణమా అనే టెన్షన్‌ కూడా మొదలైంది.