Dosti Notification Release : దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. జులై 8 నుంచి డిగ్రీ కాలేజీలు ప్రారంభం
తెలుగు రాష్ట్రాలకు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్తీ నోటీఫికేషను ఉన్నత విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు. మొదటి విడత(మే 6-25), (5 4-13), విడత (జూన్ 19-25) రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

Dost notification released.. Degree colleges classes will start from July 8
తెలుగు రాష్ట్రాలకు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్తీ నోటీఫికేషను ఉన్నత విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు. మొదటి విడత(మే 6-25), (5 4-13), విడత (జూన్ 19-25) రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
- మొదటి విడత రిజిస్ట్రేషన్..
ఇందుకు రూ.200 ఫీజ్ తో దోస్తీ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. మే 15 నుంచి మే 27 వరకు దోస్తీ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్ 3న దోస్తీ మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. జూన్ 4 నుంచి 10 లోపు దోస్తీ సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం కల్పించారు.
- రెండో విడత రిజిస్ట్రేషన్..
రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 4 నుంచి 13వ తేదీవరకు కొనసాగుతుంది. రూ.400 చొప్పున ఫీజు చెల్లించాలి. జూన్ 4 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్స్ చేసుకోవాలి. జూన్ 18న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో జూన్ 19 నుంచి 24వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి.
- మూడో విడత రిజిస్ట్రేషన్..
మూడో విడత ప్రక్రియ రిజిస్ట్రేషన్ జూన్ 19 నుంచి జూన్ 25 వరకు ఉంటుంది. జూన్ 19 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. జూన్ 29న సీట్లను కేటాయిస్తారు. జూన్ 29 నుంచి జూలై 3 వరకు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మూడో విడుత రిజిస్ట్రేషన్లకు మాత్రం విద్యార్థులు రూ.400 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- డిగ్రీలో కొత్త కోర్సులు ఇవే..
ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకాం ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆయా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దీస్తు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 8 నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి.
SSM