Visakha Fishing Harbour : ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో యూట్యూబర్ పై అనుమానాలు..! విచారణకు సీఎం జగన్ ఆదేశం..!
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో స్థానిక మత్స్యకారులు "విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రవేశద్వారం వద్ద మత్స్యకార నాయకుల" నిరసన తెలుపుతున్నారు. ఫిషింగ్ హార్బర్ గత 50 ఏండ్ల చరిత్రలోనే ఇలాంటి రోజు ఇంత వరకు రాలేదు అని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
నిన్న రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు మంటల్లో బుడిదా అయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.
ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల ఆందోళన..
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో స్థానిక మత్స్యకారులు “విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రవేశద్వారం వద్ద మత్స్యకార నాయకుల” నిరసన తెలుపుతున్నారు. ఫిషింగ్ హార్బర్ గత 50 ఏండ్ల చరిత్రలోనే ఇలాంటి రోజు ఇంత వరకు రాలేదు అని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మన ప్రధాన జీవనాధారం కోల్పోయాము అంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఒక్కో బోటు ఖరీదు రూ. 40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉంటుందని రూ. కోట్లల్లో నష్టం వాటిల్లిందని మత్స్యకారుల బాధితులు ఆర్డీవోతో విన్నవించుకున్నారు. 24 గంటల్లో మత్స్యకారులకు న్యాయం జరగకపోతే కుటుంబం తో సహా అందరం ఆత్మహత్య చేసుకుంటాము అంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రమాద స్థలాన్ని సీఎం జగన్ సందర్శించి తమకు వెంటనే 50 లక్షల చోప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రమాదానికి ఓ యూట్యూబ్ పార్టీ కారణం.?
ఈ ప్రమాదంపై సహజంగా జరిగింది కాదని.. కొందరు ఆకతాయిల పనే అంటున్నారు స్థానికులు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పంటించారని.. స్థానికులు అనుమానిస్తున్నారు. వీటన్నిటికీ మించి మరో సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.. రాత్రి ఫిషింగ్ హార్బర్ లో ఓ యూట్యూబర్ మద్యం పార్టీ ఏర్పాటు చేసి, మద్యం మత్తులో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బోటుకు నిప్పు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై నిజానిజాలు తెలాల్సి ఉంది.. ఇంతలో నిన్ను పార్టీ చేస్తున్న యూట్యూబర్, అతని స్నేహితుల కోసం గాలించగా.. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పుకోచ్చారు. కాగా ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులు ఎంతటివారైనా వదిలి పెట్టమని, ఆస్తి నష్టంపై పూర్తి స్థాయి అంచనా వేస్తున్నట్లు జేసీ తెలిపారు. పరారీలో ఉన్న వారిని పట్టుకుంటే.. ఈ ప్రమాదంపై అసలు విషయం వెలుగులోకి వస్తాయి.
ఫిషింగ్ హార్బర్ ఘటనపై సీఎం విచారణకు ఆదేశం..
విశాఖలో ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు ఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు ఈ ప్రమాదంలో బాధితులుగా ఉన్న ప్రతిఒక్కరిని ఆదుకోవాలని సీఎం జగన్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, వారికి తగు సహాయం చేయాలని సూచించారు. కాగా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణనకు ఆదేశించారు సీఎం.