చేసిందే ఒక్క మర్డర్.. దానికెందుకు సార్ ఇన్ని సీక్వెల్స్.. ఇంతకీ ఆ బాడీ ఎక్కడ..?

ఇండియన్ సినిమా హిస్టరీలో దృశ్యం సినిమాది ఒక సపరేట్ చాప్టర్. దాదాపు 10 భాషల్లో రీమేక్ అవ్వడమే కాదు.. చైనాలోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2025 | 02:15 PMLast Updated on: Feb 26, 2025 | 2:15 PM

Drushyam Movie Part 3 Is Ready

ఇండియన్ సినిమా హిస్టరీలో దృశ్యం సినిమాది ఒక సపరేట్ చాప్టర్. దాదాపు 10 భాషల్లో రీమేక్ అవ్వడమే కాదు.. చైనాలోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు. ఇండియన్ సినిమాలను చైనా వాళ్లు అసలు పట్టించుకోరు. అలాంటిది మన సినిమా రీమేక్ చేశారు అంటే దృశ్యం సత్తా అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ ఫ్రాంచైజీలో రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండింటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పదేళ్ల కింద మోహన్ లాల్, జితు జోసఫ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా అప్పట్లో 100 కోట్లు వసూలు చేసి మలయాళ సినిమా స్థాయిని పది రెట్లు పెంచేసింది. దీన్ని తెలుగులో వెంకటేష్.. తమిళంలో కమల్ హాసన్.. కన్నడలో రవిచంద్రన్.. హిందీలో అజయ్ దేవగన్ లాంటి హీరోలు రీమేక్ చేశారు. ఆ తర్వాత దృశ్యం 2 కూడా వచ్చింది.

ఇప్పుడు దృశ్యం 3 కూడా వస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైంది.. షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు. ఇదే చివరిది అని కూడా చెప్పేసాడు జీతూ జోసెఫ్. ఇదిలా ఉంటే దృశ్యం 3 మీద సోషల్ మీడియాలో మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. చేసిందే ఒక్క మర్డర్.. దానికి ఎందుకు సార్ ఇన్ని సీక్వెల్స్.. అదే మా తెలుగు హీరోలను చూడండి ఒక్కొక్క సినిమాలో కనీసం వంద మందిని లేపేస్తుంటారు.. దానికి లెక్క పత్రాలు అసలు ఉండనే ఉండవు.. కానీ మీరు చేసిన ఒక్క మర్డర్ కోసం ఎన్ని స్కెచ్ లు వేస్తున్నారు అంటూ మీమ్స్ వేస్తున్నారు వాళ్ళు. అన్నారని కాదు కానీ మన బోయపాటి సినిమాలను తీసుకుంటే హీరో అలా సరదాగా కొంతమందిని చంపేస్తాడు. అందుకే ఈ మీమ్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి.

కానీ దృశ్యంలో మాత్రం హీరో కుటుంబం ఒకే ఒక హత్య చేస్తుంది. దాన్నుంచి బయట పడడానికి ఆయన ఎన్నో పథకాలు వేస్తూ ఉంటాడు. పదేళ్ల కింద చేసిన హత్య.. ఇంత వరకు ఆ బాడీ కూడా దొరకలేదు.. తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం హీరో వేసే ప్లాన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. జోక్స్ పక్కన పెడితే ఇండియన్ సినిమాలో దృశ్యం నిజంగానే ఒక అద్భుతం. ఇప్పటికే దృశ్యం 3 కోసం తాను ముందు సైన్ చేసిన సినిమాలను కూడా పక్కన పెట్టి రీమేక్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు అజయ్ దేవగన్. తెలుగులో వెంకటేష్ కూడా ఈ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నాడు.