Tirumala : తిరుమల పొగ మంచు కారణంగా.. శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలు మూసివేత..

ఏపీ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండను పొగ మంచు కమ్మెసింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ను మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింన సంగతి తెలిసిందే.. కాగా నిన్న సాయంత్ర తిరుమల పొగ మంచు వర్షం కారణంగా.. పాపనినాశం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ మూసివేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2023 | 12:51 PMLast Updated on: Dec 16, 2023 | 12:51 PM

Due To Fog In Tirumala Lords Feet Sin Destruction Path Closed

ఏపీ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండను పొగ మంచు కమ్మెసింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ను మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింన సంగతి తెలిసిందే.. కాగా నిన్న సాయంత్ర తిరుమల పొగ మంచు వర్షం కారణంగా.. పాపనినాశం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ మూసివేసింది. ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. పొగమంచుతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయం సమీపంలోని భక్తులతో పాటు ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. అలిపిరి మార్గంలో వెళ్లే వామనదారులను టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తూ పంపుతున్నాయి.

తిరుమల లో ఘాట్ రోడ్డులో పొంగ మంచు కారణంగా ఎదురుగా వెళ్తున్న వాహనాలు కనిపించక పట్ట పగలే టైట్లు వేసుకోని ప్రయాణం సాగించాల్సి వస్తుంది. మరో వైపు పొగ మంచు కారణం కొండపైన తిరుమల క్షేత్రం ప్రధాన గోపురం తప్ప మరేమి కనిపించడం లేదు.