Salaar: సలార్ వాయిదాతో పండగ చేసుకుంటున్న చిన్న సినిమాలు
సలార్ వాయిదాపడడం ఆలస్యం.. కాచుకుని కూర్చున్న చిన్న సినిమాలు సెప్టెంబర్ 28పై కర్చీఫ్ వేసేశాయి. మూడు చిన్న చిత్రాలు బరిలోకి దిగినా.. పెద్ద సినిమాకు ప్లేస్ వుండడంతో.. కాస్త లేటైనా.. స్కంద కూడా వచ్చేస్తోంది.

Due to the delay in the release of Prabhas starrer Salaar, all the small films are queuing up
సలార్ వాయిదాపడడం ఆలస్యం.. కాచుకుని కూర్చున్న చిన్న సినిమాలు సెప్టెంబర్ 28పై కర్చీఫ్ వేసేశాయి. మూడు చిన్న చిత్రాలు బరిలోకి దిగినా.. పెద్ద సినిమాకు ప్లేస్ వుండడంతో.. కాస్త లేటైనా.. స్కంద కూడా వచ్చేస్తోంది. కుర్ర హీరోలు నటించిన ‘ మ్యాడ్’ సెప్టెంబర్ 28న రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేయడంతో.. సలార్ వాయిదాపడుతోందన్న వార్త ఒక్కసారిగా బైటకొచ్చింది. మోస్ట్ వాటెండ్ మూవీ సలార్‌తో ఎవరూ పోటీపడరు. సలార్ పోస్ట్‌పోన్ అవుతుందన్న వార్త ఇంటర్నల్‌గా తెలియడంతో.. చిన్న సినిమాలన్నీ సెప్టెంబర్ 28పై కన్నేశాయి. సెప్టెంబర్ 28న ముందుగా మ్యాడ్ బరిలోకి దిగితే.. ఆతర్వాత అక్టోబర్ 6న రావాల్సిన కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ సలార్‌కు డేట్‌కు వచ్చేస్తోంది. ఇదే రోజు స్కంద కూడా వుండడంతో ఒక రోజు లేటుగా.. 29న శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’ రిలీజ్ అవుతోంది.
15న రావాల్సిన స్కందకు పెద్దగా కాంపిటేషన్ లేదు. చంద్రముఖి2 రిలీజ్ అవుతున్నా.. పోటీ కాదనే చెప్పాలి. అయితే.. ఈ రెండు సినిమాలు ఒకే నిర్మాత డిస్ట్రిబ్యూట్ చేయడంతో.. సలార్ వాయిదాతో అనుకోకుండా వచ్చిన ఖాళీని స్కందతో భర్తీ చేశారు. రామ్ పంచె కట్టుతో.. శ్రీలీల ఓణీతో వున్న రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒకరకంగా స్కందకు 15 కంటే.. 28నే బెటర్ రిలీజ్ డేట్ అవుతోంది. 28న మిలాద్ నబి.. అక్టోబర్ 2న గాంధీజయంతి కలిసి రావడంతో ఐదు రోజులపాటు మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ వుండడంతో.. స్కంద టీం కూడా రిలీజ్ వాయిదాకు ఓకె చెప్పింది.
సెప్టెంబర్ 28నే రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా వస్తుందని ప్రచారం సాగినా.. కాంపిటీషన్ మరీ ఎక్కువైపోతుంది. మూడు చిన్న సినిమాలతోపాటు.. క్రేజీ ప్రాజెక్ట్ స్కందతో పోటీపడాలి. అందులోనూ.. విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవడంతో.. టైగర్ నాగేశ్వరరావు తప్పుకున్నాడు. దసరాకు వస్తున్న భగవంత్ కేసరి.. విజయ్ లియోతో పోటీపడుతూ.. అక్టోబర్ 20 టైగర్ వస్తాడో? లేదంటే అటు ఇటు జరుగుతాడో చూడాలి మరి.