మెదక్ లో కుప్పకూలిన దుండిగల్ విమానం.. ట్రైనర్ తో సహా కి పైలెట్ సజీవ దహనం..

మెదక్‌ జిల్లాలోని తుఫ్రాన్‌లో శిక్షణ విమానం కూలిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలవిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్‌ మృతిచెందినట్టు తెలుస్తోంది. 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2023 | 11:39 AMLast Updated on: Dec 04, 2023 | 11:39 AM

Dundigal Plane Crashed In Medak Co Pilot Including Trainer Burnt Alive

మెదక్‌ జిల్లాలోని తుఫ్రాన్‌లో శిక్షణ విమానం కూలిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలవిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్‌ మృతిచెందినట్టు తెలుస్తోంది.

2024లో ఎంపీగా బర్రెలక్క పోటీ.. ఆమెకు ఎన్ని ఓట్లు అంటే..! 

తుఫ్రాన్‌ మున్సిపల్‌ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య సోమవారం ఉదయం ఉదయం 8.30 గంటల సమయంలో శిక్షణ విమానం కూలిపోయింది. కాగా, కూలిన విమానాన్ని దుండిగల్‌ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించారు పోలీసులు.. ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో మంటలు క్షణాల్లో వ్యాప్తి చెందాయి.. విమానం కూలిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు శబ్దం వచ్చిన వైపు రాగా విమానం మంటల్లో కాలిపోతూ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లినా పైలట్ ని రక్షించేందుకు వెళ్లిన అప్పటికే పూర్తికా దగ్ధమయిపోయిన విమానం.

గతంలో కూడా పలుమార్లు.. హైదరాబాద్ పరిధిలో శిక్షణ విమానం కూలి పోయిన ఘటనలు జరిగాయి. కొన్నిసార్లు శిక్షణ పైలట్లు ప్రాణాలతో బయటపడేవారు. అయితే ఈ ఘటనలో వెంటనే మంటలు అంటుకోవడం, పైలట్ కు తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో సజీవ దహనమైనట్టు సమాచారం.. పైలట్ తో పాటు కోపైలట్ కూడా మంటలకు ఆహుతైనట్టు సమాచారం. పోలీసులు సమాచారం మేరకు ఇద్దరి మృతదేహాలు గుర్తు పడలేని స్థితిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు స్థానికులు..