Earthquake : మేఘాలయలో భూకంపం.. 3.4గా నమోదు..
మేఘాలయ (Meghalaya) లో భూకంపం (Earthquakes) సంభవించింది.

Earthquake in Meghalaya.. registered as 3.4..
మేఘాలయ (Meghalaya) లో భూకంపం (Earthquakes) సంభవించింది. సోమవారం తెల్లవారుజామున తురాకు తూర్పు-ఈశాన్యంగా 78 కిలోమీటర్ల దూరంలో 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం ఆందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్వల్ప ప్రకంపనలతో ఎలాంటి జరుగం జరుగలేదని అధికారులు తెలిపారు. భూపకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో 25.71 అక్షాంశం, రేఖాంశం 90.95 వద్ద నమోదైనట్టు తెలిపారు. ఈ ఘటనలో ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు రాలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Suresh SSM