Earthquake : తైవాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదు..
చైనాలోని తైవాన్ తంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.3గా నమోదైందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్ జెడ్) వెల్లడించింది. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరిగినట్టుగా ఇప్పటి వరకు సమాచారం లేదు.

ఈ భూకంప కేంద్రం.. తైవాన్ లోని తైటుంగ్ కౌంటీకి సమీపంలో సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో కేంద్రికృతం అయిన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్, వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. ఎక్కువగా గ్రామీణ ప్రాంతంగా ఉన్న కౌంటీలో స్వల్ప ప్రకంపనలు మాత్రమే నమోదయ్యాయి. రాజధాని తైపీలో భూకంపం సంభవించలేదు. తైవాన్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల కూడలికి సమీపంలో ఉండటం వల్ల తరచూ భూకంపాలకు గురవుతుంటుంది.