Philippines Earthquake : ఫిలిప్పీన్స్ లో భూకంపం..
ఫిలిప్పీన్స్లో భూకంపం (Philippines Earthquake) సంభవించింది.

Earthquake in the Philippines
ఫిలిప్పీన్స్లో భూకంపం (Philippines Earthquake) సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని లేటె ప్రావిన్స్‌లో 6.0 ప్రాథమిక తీవ్రతతో ఆఫ్‌షోర్ భూకంపం సంభవించిందని ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సిస్మోలజీ తెలిపింది. శుక్రవారం సాయంత్రం 6:16 గంటలకు భూకంపం సంభవించినట్లు ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం, తీర ప్రాంత పట్టణమైన దులాగ్‌కు ఆగ్నేయంగా 32 కి.మీ దూరంలో 8 కి.మీ లోతులో తాకినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. ఈ భూప్రకంపణలతో ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.
SSM