Earthquakes : మహారాష్ట్రలో భూప్రకంపనలు..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

Earthquakes in Maharashtra
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ప్రకంపనలు చాలా స్వల్పంగా ఉన్నాయని, ఎలాంటి నష్టం జరగలేదని నిపుణులు తెలిపారు. కాగా భూకంప తీవ్రతతో రిక్టల్ స్కేల్ పై 2.5గా నమోదైంది. దీంతో జనాలు భయాందోళనతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. ఐదు కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు వచ్చినట్టు నివేదించింది. కాగా, ఇది చాలా చిన్న భూకంపమని, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగదని అధికారులు వెల్లడించారు.