DASARI SAHITHI: సాహితికి గ్లాస్‌ గుర్తు.. ఓట్లు గుద్దేస్తామంటున్న పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌

తెలంగాణలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాక్టర్‌, మోడల్‌ దాసరి సాహితి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. రీసెంట్‌గానే చేవెళ్ల నుంచి నామినేషన్‌ కూడా వేసింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయడంతో సాహితికి కూడా గ్లాస్‌ గుర్తు కేటాయించింది ఈసీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 30, 2024 | 05:52 PMLast Updated on: Apr 30, 2024 | 5:52 PM

Ec Allotted Glass Symbol To Indipendent Mp Candidate Dasari Sahithi

DASARI SAHITHI: ఏపీలో టీడీపీ, జనసేన కూటమిని గ్లాస్‌ గుర్తు పెడుతున్న టెన్షన్‌ అంతా ఇంతా కాదు. ఇండిపెండెంట్లకు గ్లాస్‌ గుర్తు కేటాయించడంతో రెండు పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలతో పాటు.. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా గాజుగ్లాస్‌ గుర్తును కేటాయించింది ఈసీ. గ్లాస్‌ సింబల్‌ గుర్తు ఇంకా ఫ్రీ సింబల్స్‌ జాబితాలోనే ఉండటంతో ఇలా చేశామంటూ వివరణ కూడా ఇచ్చింది.

Malavika Mohanan: ఎందుకు తొందర పడుతున్నావు.. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి..?

ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ అభ్యర్థికి గ్లాస్‌ గుర్తు కేటాయించింది. తెలంగాణలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాక్టర్‌, మోడల్‌ దాసరి సాహితి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. రీసెంట్‌గానే చేవెళ్ల నుంచి నామినేషన్‌ కూడా వేసింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయడంతో సాహితికి కూడా గ్లాస్‌ గుర్తు కేటాయించింది ఈసీ. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్‌ చేసింది. తనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్‌ అని రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సాహితీ. అటు పాలిటిక్స్‌లో ఇటు సినిమాల్లో తనకు పవన్‌ కళ్యాణ్‌ అంటే చాలా ఇష్టమంటూ చెప్పింది. ఇప్పుడు ఆయనకు చెందిన గుర్తే ఈసీ తనకు కేటాయించడంతో చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్‌ చేసింది. పుట్టింది ఏపీలో ఐనా హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయ్యింది సాహితీ ఫ్యామిలీ.

ఓ పక్క మోడలింగ్‌ చేస్తూ మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తోంది. మేకసూరి అనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సాహితీ.. సోలో బతుకే సో బెటర్​, భోళా శంకర్​, మా ఊరి పొలిమేర, సర్కార్​ నౌకరి లాంటి చిత్రాల్లో నటించారు. మిగిలిన సినిమాల కంటే పొలిమేర సినిమాతో సాహితికి మంచి పేరు వచ్చింది. పవన్ ఫ్యాన్‌గా గ్లాస్‌ గుర్తుతో బరిలోకి దిగుతున్న సాహితికి చేవెళ్ల పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఎలాంటి రిజల్ట్‌ ఇస్తారో చూడాలి.