JANASENA: జనసేనదే గాజు గ్లాసు.. కామన్ సింబల్ ఇచ్చిన ఈసీ..!
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనలతో ఏపీ సీఈఏ ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు దక్కనుంది. ఇది ఆ పార్టీకి పెద్ద ఊరటగా చెప్పుకోవాలి.
JANASENA: జనసేనకు ఈసీ శుభవార్త అందించింది. గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి కామన్ సింబల్‌గా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కామన్ సింబల్ కేటాయింపుపై అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనలతో ఏపీ సీఈఏ ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు.
YS JAGAN: చంద్రబాబును నమ్మితే.. చంద్రముఖిని నిద్రలేపినట్లే: వైఎస్ జగన్
దీంతో అన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు దక్కనుంది. ఇది ఆ పార్టీకి పెద్ద ఊరటగా చెప్పుకోవాలి. ఎన్నికల గుర్తుల నిబంధనల్లోని పారా 10 బి ప్రకారం గ్లాసు గుర్తు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ. గతంలో గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్స్‌లో పేర్కొంది. అంటే.. జనసేన అభ్యర్థులకే కాకుండా.. స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈ గుర్తు కేటాయించే అవకాశం ఉండేది. అయితే, దీనిపై అభ్యంతరం చెబుతూ జనసేన ఈసీని ఆశ్రయించింది.
గ్లాసు గుర్తును తమ పార్టీకే కామన్ సింబల్‌గా కేటాయించాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన ఈసీ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈసీ నిర్ణయంపై జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జైభారత్ నేషనల్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో టార్చిలైటు గుర్తు కేటాయించింది ఈసీ.