Anjani Kumar: మాజీ డీజీపీ అంజనీ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేత
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువెడుతున్న సమయంలోనే డీజీపీ అంజనీకుమార్ ఇలా రేవంత్ రెడ్డిని వెళ్లి కలవడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధం. కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని కలవడం, ప్రమాణ స్వీకారంపై చర్చించడంపై అంజనీ కుమార్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Anjani Kumar: ఇటీవలే సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్‌కు గుడ్ న్యూస్ చెప్పింది ఈసీ. అంజని కుమార్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు అంజనీ కుమార్ తెలంగాణ డీజీపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ డిసెంబర్ 3న ఆయన ఉదయమే వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువెడుతున్న సమయంలోనే డీజీపీ అంజనీకుమార్ ఇలా రేవంత్ రెడ్డిని వెళ్లి కలవడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధం.
AP CM JAGAN: జగన్ కళ్ళు తెరువు ! ఏపీ మాహిష్మతి మునిగిపోయే టైమ్ వచ్చింది !!
కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని కలవడం, ప్రమాణ స్వీకారంపై చర్చించడంపై అంజనీ కుమార్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆయనను ఈసీ వివరణ కోరింది. అదే రోజు సాయంత్రం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. తర్వాత అంజనీ కుమార్ స్థానంలో ప్రభుత్వ సిఫారసు మేరకు రవి గుప్తాను తెలంగాణ డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంపై అంజనీ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీకి తన జవాబు ఇచ్చారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తానని కేంద్ర ఎన్నికల సంఘానికి అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. ఎన్నికల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని చెప్పారు.
ఉద్దేశ పూర్వకంగా కోడ్ ఉల్లంఘంచలేదని తెలిపారు. ఆయన వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ.. తాజాగా ఆయన సస్పెన్స్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే, ఇప్పుడు అంజనీ కుమార్ ఏ హోదాలో కొనసాగుతారు అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.