PAWAN KALYAN: జనసేనకు షాక్.. పవన్‌కు ఈసీ నోటీసులు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా .. అనకాపల్లిలో నిర్వహించిన సభలో సీఎం జగన్‌ పై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆ విమర్శలపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2024 | 08:07 PMLast Updated on: Apr 10, 2024 | 8:07 PM

Ec Sends Notices To Janasena Chief Pawan Kalyan On Derogatory Remarks On Ys Jagan

PAWAN KALYAN: ఎన్నికల వేళ ప్రచారంలో నేతలు.. ప్రత్యర్థులపై, పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటారు. ఐతే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూనే ఉంటుంది. చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు జారీ చేస్తూ ఉంటుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా .. అనకాపల్లిలో నిర్వహించిన సభలో సీఎం జగన్‌ పై పవన్ తీవ్ర విమర్శలు చేశారు.

APPSC Group 2 Results: ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

దీంతో ఆ విమర్శలపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారని ఆ ఫిర్యాదులో వైసీపీ నేతలు ఆరోపించారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం.. పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. సీఎం జగన్‌పై అసత్య ఆరోపణలు గుప్పించారని.. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా పవన్ కల్యాణ్ మాట్లాడినట్లు తన ఫిర్యాదులో మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 8న అనకాపల్లి సభలో సీఎం జగన్‌ మీద పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్కాం స్టార్, లాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వీటిపై ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. రెండు రోజుల్లోగా నోటీసులకు సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్‌కు సూచించింది. ఇక అటు పవన్‌ ప్రచారం స్పీడ్‌ పెంచారు. స్టార్ క్యాంపెయినర్‌ లిస్ట్‌ కూడా అనౌన్స్‌ చేశారు. హైపర్ ఆది, గెటప్‌ శ్రీను, డ్యాన్స్ మాస్టర్‌ జానీ, క్రికెటర్ అంబటిరాయుడుకు అందులో చోటు దక్కింది. మరి ఈసీ నోటీసులపై పవన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.