Wine Shops Bandh : ఈసీ కీలక నిర్ణయం.. తెలంగాణలో 3 రోజులు వైన్‌ షాపులు బంద్‌..!

ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లు లీడర్లు బిజీబిజీగా ఉంటారు. అందరిని ఆకర్షించేందుకు నేతలు, ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఎంజాయ్‌ చేయడానికి కొందరు ఓటర్లు నెల రోజులు చాలా బిజీ షెడ్యూల్‌ వీళ్లది. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. అన్ని రాష్ట్రాల్లో కనిపించే సీన్‌ ఇదే. ఎలాగైనా ఓట్లు దక్కించుకునేందుకు గిఫ్ట్‌లు, డబ్బులు పంచుతూనే ఉంటారు కొందరు నాయకులు. ఇక మందు విషయం అయితే వేరే రేంజ్‌లో ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2023 | 01:41 PMLast Updated on: Nov 04, 2023 | 1:41 PM

Ecs Key Decision 3 Days Wine Shops Bandh In Telangana

ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లు లీడర్లు బిజీ బిజీగా ఉంటారు. అందరిని ఆకర్షించేందుకు నేతలు, ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఎంజాయ్‌ చేయడానికి కొందరు ఓటర్లు నెల రోజులు చాలా బిజీ షెడ్యూల్‌ వీళ్లది. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. అన్ని రాష్ట్రాల్లో కనిపించే సీన్‌ ఇదే. ఎలాగైనా ఓట్లు దక్కించుకునేందుకు గిఫ్ట్‌లు, డబ్బులు పంచుతూనే ఉంటారు కొందరు నాయకులు. ఇక మందు విషయం అయితే వేరే రేంజ్‌లో ఉంటుంది. తాగినోడికి తాగినంత అన్నట్టు సీన్‌ కనిపిస్తుంది కొన్ని ఏరియాస్‌లో. ముఖ్యంగా అలాంటి ప్రాంతాల్లో ఉండే మందుబాబులకు ఈ నెల రోజులు దసరా, దీపావళి కలిసి వచ్చినట్టే అని చెప్పాలి. అలాంటి మందుబాబులకు ఓ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయాలని నిర్ణయించింది.

CM KCR : కోనాయిపల్లి వెంకన్న సన్నిదిలో సీఎం కేసీఆర్.. కేసీఆర్ కి ఎందుకంత సెంటిమెంట్..?

ఈ నెల 28, 29, 30 తేదీల్లో మద్యం షాపులు మూతబడనున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఈ విషయాన్ని ధృవీకరించింది. మూడు రోజుల పాటు తెలంగాణలో మద్యం షాపులు, బార్లు మూసివేయాలంటూ నిర్ణయించింది. నవంబర్‌ 30న తెలంగాణలో పోలింగ్‌ జరగబోతోంది. దీనికి రెండు రోజుల ముందు నుంచే వైన్‌ షాపులు మూసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పోలింగ్‌ ముగిసిన తరువాత.. అంటే డిసెంబర్‌ 1న మళ్లీ వైన్‌ షాపులు తెరుచుకోనున్నాయి. ఈ మూడు రోజులు మందుబాబులు తమను తాము కంట్రోల్‌ చేసుకోక తప్పదు అంటున్నారు అధికారులు. ఇది లిక్కర్‌ లవర్స్‌కు కాస్త కష్టమైన పనే అయినప్పటికే ఎన్నికలు కాబట్టి వేరే ఆప్షన్‌ లేదు.