MLC KAVITHA: కవిత ఇంట్లో రూ.100 కోట్లు, 50 కిలోల బంగారం ?

ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు రెండు టీంలుగా విడిపోయి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టులో కవిత వేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే.. అధికారులు ఇలా కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2024 | 05:16 PMLast Updated on: Mar 15, 2024 | 5:16 PM

Ed And It Officers Found Rs 100 Crores And 50 Kg Gold In Mlc Kavitha House

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ, ఐటీ అధికారులు ఏకకాలంలో ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు రెండు టీంలుగా విడిపోయి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టులో కవిత వేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే.. అధికారులు ఇలా కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రీసెంట్‌గానే ఈ కేసులో కవితను సాక్షిగా కాకుండా దోషిగా చేర్చారు అధికారులు.

CONGRESS: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. రేవంత్‌తో భేటీ..

విచారణకు రావాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు. కానీ సుప్రీంలో పిల్‌ పెడింగ్‌లో ఉన్న కారణంగా తాను విచారణకు రాలేనంటూ కవిత ఈడీకి రిప్లై ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో డైరెక్ట్‌గా అధికారులే ఢిల్లీ నుంచి వచ్చి సోదాలు నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదాలా ఉంటే కవిత ఇంట్లో విచారణ గురించి సోషల్‌ మీడియాలో ఓ వార్త సంచలనంగా మారింది. ఈడీ అధికారులు సోదాల్లో కవితం ఇంట్లో వంద కోట్లు డబ్బు దొరికిందంటూ కొందరు చెప్తున్నారు. డబ్బుతో పాటు 50 కిలోల బంగారం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సోదాలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు కూడా ఈ డబ్బు, బంగారం చూసి షాకైనట్టు చెప్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు కార్యకర్తలు ఈ వార్తలు స్ప్రెడ్‌ చేస్తున్నారు. దీనిపై అధికారులు అఫీషియల్‌గా స్పందించాల్సి ఉంది. దాదాపు 4 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.

అధికారుల సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్‌ శ్రేణులు కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకున్నారు. మరోపక్క కవిత లాయర్లు ఈ సోదాలను ఖండిస్తున్నారు. సుప్రీ నుంచి ఎలాంటి స్పష్టమైన తీర్పు రాకుండా ఎలా సోదాలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. పిల్‌ గురించి తీర్పు వచ్చేదాకా కవిత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ సుప్రీం కోర్టు చెప్పిందని.. కానీ అధికారులు ఇలా నేరుగా ఇంటికి వచ్చిన సోదాలు చేయడం కరెక్ట్‌ కాదని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో చెకింగ్‌ పూర్తైన తరువాత.. అధికారులు గుర్తించిన డబ్బు, ఆస్తులు, బంగారం గురించి స్పష్టత రానుంది.