బ్రేకింగ్: అడ్డంగా బుక్కైన హర్షా సాయి, రంగంలోకి ఈడీ
సాయం పేరుతో యూట్యూబ్ లో షో చేస్తున్న ప్రముఖ యూట్యూబర్ హర్షా సాయిపై ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రేప్ కేసులో తప్పించుకుని తిరుగుతున్న హర్షా సాయిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది.

సాయం పేరుతో యూట్యూబ్ లో షో చేస్తున్న ప్రముఖ యూట్యూబర్ హర్షా సాయిపై ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రేప్ కేసులో తప్పించుకుని తిరుగుతున్న హర్షా సాయిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ తో కోట్లు కూడబెట్టినట్టు డీజీపీకి ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ వ్యక్తి ఏకంగా హర్షా సాయి కారణంగా 20 లక్షలు నష్టపోయినట్టు ఫిర్యాదు చేసాడు.
ఇల్లీగల్ యాప్స్ కి ప్రమోషన్ చేసి 150 నుంచి 200 కోట్లు సంపాదించినట్టు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కో బెట్టింగ్ యాప్ నుంచి 6 నుంచి 8 కోట్లు వసూలు చేస్తున్నాడు అని సమాచారం. ఈడీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే సూచనలు కనపడుతున్నాయి.