ED Arrest Hemant Soren ?: హేమంత్ సొరెన్ అరెస్ట్ కి ఈడీ రెడీ … భార్యకు సీఎం పదవి ?
జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand CM) హేమంత్ సోరెన్ (Hemant Soren) ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూకుంభకోణం, మనీలాండరింగ్ (Money laundering) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఇప్పటికే 9 సార్లు నోటీసులు ఇచ్చింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. సోమవారం ఢిల్లీలోని నివాసంలో సోరెన్ ఉన్నారని తెలుసుకున్న ఈడీ (ED) అధికారులు అక్కడికి వెళ్ళారు.

ED is ready to arrest Hemant Soren ... CM post for his wife?
జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand CM) హేమంత్ సోరెన్ (Hemant Soren) ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూకుంభకోణం, మనీలాండరింగ్ (Money laundering) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఇప్పటికే 9 సార్లు నోటీసులు ఇచ్చింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. సోమవారం ఢిల్లీలోని నివాసంలో సోరెన్ ఉన్నారని తెలుసుకున్న ఈడీ (ED) అధికారులు అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడి నుంచి ఎస్కేప్ అయిన 18 గంటల తర్వాత రాంచీలో ప్రత్యక్షమయ్యారు. సోరెన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం దాదాపు 13 గంటల పాటు ఈడీ అధికారులో ఢిల్లీలోని ఇంట్లోనే వెయిట్ చేశారు.
సోరెన్ ఎంతకూ రాకపోవడంతో చివరకు సోదాలు నిర్వహించారు. హరియాణా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న ఓ BMWతో పాటు మరో కారు, 36 లక్షల రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. BMW కారు బినామీ పేరున ఉన్నట్టు తెలిపారు. స్కామ్ కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కూడా ఢిల్లీలోని సొరెన్ ఇంట్లో దొరికినట్టు చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున బడ్జెట్ ప్రిపరేషన్ లో సొరెన్ బిజీగా ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.
సీఎం సీట్లో సొరెన్ భార్య హేమంత్ సోరెన్ అందుబాటులోకి రాకపోవడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా- జేఎంఎం (JMM) ఆధ్వర్యంలోని కూటమి ఎమ్మెల్యేలు సోమవారం నాడు రాంచీకి చేరుకున్నారు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలు లగేజీతో రాంచీకి వచ్చారు. కొన్ని రోజుల పాటు రాజధానిలోనే ఉండాలని వీళ్ళకి ఆయా పార్టీల నుంచి ఆదేశాలు అందాయి. అయితే 18 గంటల ఎస్కేప్ తర్వాత మంగళవారం ఉదయం ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ రాంచీకి చేరుకున్నారు.
ఈడీ అధికారులు ఎలాగైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో … సొరన్ తన భార్య కల్పనాకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలోని అన్ని పార్టీల అభ్యర్థులు సాయంత్రం వరకూ సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకుంటారని తెలుస్తోంది. బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట కల్లా ఈడీ అధికారులకు అందుబాటులో ఉంటానని హేమంత్ సొరెన్ సమాచారం ఇచ్చారు. దాంతో ముఖ్యమంత్రి ఎన్నిక కార్యక్రమాన్ని ఈలోగానే పూర్తి చేస్తారని అనుకుంటున్నారు.