Arvind Kejriwal: ఐఫోన్ పాస్‌వర్డ్స్ చెప్పని కేజ్రీవాల్.. యాపిల్ సహాయం కోరిన ఈడీ
కేజ్రీవాల్ పాస్‌వర్డ్స్ చెప్పడం లేదు. అయినప్పటికీ ఐఫోన్‌ను యాక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాము కేజ్రీవాల్ ఫోన్ యాక్సెస్ చేసేందుకు సహకరించాల్సిందిగా ఈడీ అధికారులు యాపిల్ సంస్థను కోరారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా ఆయన వాడే ఐఫోన్, ల్యాప్‌టాప్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈడీ అధికారులు వాటిలోని డేటాను విశ్లేషించాల్సి ఉంది. అప్పుడే కేసులో కీలక విషయాలు బటయపడతాయి. కానీ, ఈడీ అధికారులు వాటిని యాక్సెస్ చేయాలంటే.. కేజ్రీవాల్ పాస్‌వర్డ్స్ చెప్పాలి. కానీ, కేజ్రీవాల్ పాస్‌వర్డ్స్ చెప్పడం లేదు.
GOLD PRICES: మండిపోతున్న బంగారం.. తులం బంగారం ధర ఎంత పెరిగిందంటే..
అయినప్పటికీ ఐఫోన్‌ను యాక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాము కేజ్రీవాల్ ఫోన్ యాక్సెస్ చేసేందుకు సహకరించాల్సిందిగా ఈడీ అధికారులు యాపిల్ సంస్థను కోరారు. యాపిల్ సంస్థ ఫోన్ యాక్సెస్ చేసేందుకు అంగీకరించి, టెక్నికల్‌గా సాయపడితేనే కేజ్రీవాల్ ఫోన్ యాక్సెస్ చేయొచ్చు. అందులోని డేటాను అనలైజ్ చేయొచ్చు. ఫోన్‌లోని విషయాల బయటపడితేనే లిక్కర్ స్కాంలో కీలక విషయాలు తెలుస్తాయి. అయితే, ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. ప్రస్తుతం కేజ్రీవాల్ వాడుతున్న ఫోన్.. ఏడాది క్రితం తీసుకున్నదే. అంటే.. అప్పటికే లిక్కర్ స్కాం జరిగిపోయిందనేది ఈడీ వాదన. దీంతో లిక్కర్ స్కాం జరిగిన సమయంలో ఉపయోగించిన ఫోన్ ఏదని ఈడీ అధికారులు ప్రశ్నించారు.
కానీ, కేజ్రీవాల్ మాత్రం దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికే కేజ్రీవాల్.. పలు ఫోన్లను మార్చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తమ విచారణకు కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించడం లేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. మరికొద్ది రోజులు కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ కోరారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు.. ఆయనకు మరో 15 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది.