BRS MLC కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో ఈడీ సోదాలు..
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ (MLC)కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడి సోదాలు నిర్వహిస్తున్నారు.

ED searches at residence of BRS MLC Kavitha Adabidda Akhila..
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ (MLC)కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడి సోదాలు నిర్వహిస్తున్నారు. కవిత భర్త బంధువుల ఇళ్ళలో ఈడీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. మాదాపూర్ లోని కవిత ఆడపడుచు అఖిల (Akhila) నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లపైనా రైడ్స్ (IT raids) జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor case) కేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె భర్తకూ నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే కవిత, అనిల్ బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. తాజాగా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ వ్యవహారాలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు.